‘చివరి’ పెళ్లికూతురు | the last bridal make up of kosavo | Sakshi
Sakshi News home page

‘చివరి’ పెళ్లికూతురు

Aug 10 2014 12:06 AM | Updated on Sep 2 2017 11:38 AM

‘చివరి’ పెళ్లికూతురు

‘చివరి’ పెళ్లికూతురు

ఫొటోలో ఉన్న ‘నవవధువు’ పేరు ఆర్లెటా సాహితి. ఈమె కొసావో దేశంలోని బోస్నియన్ యువతి. రాజధాని నగరం ప్రిస్టినాలోని ‘ఎత్నలాజికల్ మ్యూజియం’లో జరిగిన ‘సంప్రదాయ వివాహ వేడుక’ ప్రదర్శనలో ఆమెను ఇలా ముస్తాబు చేశారు.

వర్ణం

ఫొటోలో ఉన్న ‘నవవధువు’ పేరు ఆర్లెటా సాహితి. ఈమె కొసావో దేశంలోని బోస్నియన్ యువతి. రాజధాని నగరం ప్రిస్టినాలోని ‘ఎత్నలాజికల్ మ్యూజియం’లో జరిగిన ‘సంప్రదాయ వివాహ వేడుక’ ప్రదర్శనలో ఆమెను ఇలా ముస్తాబు చేశారు. వేల ఏళ్లనాటి ఈ తరహా అలంకరణలో ముఖం మీద పొరలు పొరలుగా రకరకాల వర్ణాలు వేస్తారు.

బంగారు వృత్తాలు జీవితచక్రాన్ని సూచిస్తే, గీతలేమో వాటిని చేరుకోవడానికి మనిషి నడవాల్సిన దారులు. ఎరుపు వృత్తం గర్భధారణను సూచిస్తే, నీలి, ఎరుపు చుక్కలు సంతానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అయితే, ఈ రకం చిత్రణ పాతకాలపు ముసలమ్మలు మాత్రమే చేయగలుగుతున్నారు. అందువల్ల ఇది కూడా అంతరించే ప్రమాదంలో పడింది. దాన్ని ప్రతిబింబించేలాగా శీర్షికలో చివరి పెళ్లికూతురు అన్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement