మధుమేహాన్ని హరించే చెక్క | Wood draining diabetes | Sakshi
Sakshi News home page

మధుమేహాన్ని హరించే చెక్క

Jul 25 2017 11:06 PM | Updated on Sep 5 2017 4:51 PM

మధుమేహాన్ని హరించే చెక్క

మధుమేహాన్ని హరించే చెక్క

దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది.

గుడ్‌ఫుడ్‌

దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ (టైప్‌ 2 డయాబెటిస్‌) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది. దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్‌ తీసుకుంటే  గుండెకు హాని చేసే (ఎల్‌డిఎల్‌)కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది.   ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్‌) వంటి క్యాన్సర్‌ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్‌లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.

రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌ కూడా. రోజూ ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి చిటికెడు వేసి మరిగించి కొద్దిగా తాగవచ్చు. రుచికి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement