మూడొందలు కాదు.. ఐదొందలు.. | Sakshi
Sakshi News home page

మూడొందలు కాదు.. ఐదొందలు..

Published Sat, Jun 27 2015 10:54 PM

మూడొందలు కాదు.. ఐదొందలు..

మిఖాయిల్ గోర్బచెవ్‌గారు అధ్యక్షుడిగా ఉన్నకాలంలో బ్రిటిష్ మంత్రి ఒకరు సోవియట్ పర్యటనకు విచ్చేశారు. సోవియట్ లాంఛనాల మేరకు బ్రిటిష్ మంత్రిగారికి అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేశారు. అధ్యక్షుడు గోర్బచెవ్ నివాసంలో విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. విందు సందర్భంగా పిచ్చాపాటీ మాటల సందర్భంగా రష్యన్ వంటకాల ప్రాశస్త్యం ప్రస్తావనకు వచ్చింది.

రష్యన్లు బంగాళ దుంపలతో కనీసం మూడొందల రకాల వంటకాలు చేయగలరని బ్రిటిష్ మంత్రిగారితో గోర్బచెవ్ గారి సతీమణి రైసా గొర్బచెవ్  చెప్పారు. ‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ చందంగా ఉన్న ఈ మాటలను బ్రిటిష్ మంత్రిగారు నమ్మలేదు. ఆయన బ్రిటన్‌కు తిరిగి వెళ్లిన కొద్దిరోజులకు రైసా గోర్బచెవ్ నుంచి కానుకగా ఆయనకు ఒక వంటల పుస్తకం అందింది. దాంతోనే పంపిన లేఖలో ఇలా ఉంది. ‘మీకు నేను పొరపాటుగా చెప్పాను.. బంగాళ దుంపలతో మూడొందలు కాదు, ఐదొందల రకాల వంటకాలు చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement