ఆ నేడు 1 సెప్టెంబర్ 1952 | That today, 1 September 1952 | Sakshi
Sakshi News home page

ఆ నేడు 1 సెప్టెంబర్ 1952

Sep 1 2015 12:04 AM | Updated on Apr 4 2019 3:48 PM

ఆ  నేడు 1 సెప్టెంబర్ 1952 - Sakshi

ఆ నేడు 1 సెప్టెంబర్ 1952

అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే జీవితాన్ని సార్థకం చేసి, అతని పేరుకు పర్యాయ పదంగా నిలిచిన నవల ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది ....

అలలే కలలై
 
అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే జీవితాన్ని సార్థకం చేసి, అతని పేరుకు పర్యాయ పదంగా నిలిచిన నవల ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’. ఆనాడు ఇదే రోజు అమెరికన్ మ్యాగజైన్ ‘లైఫ్’లో ఈ నవల మొదలైంది.  నవల పుణ్యమా అని రెండు రోజుల్లోనే లక్షలాది ‘లైఫ్’ కాపీలు అమ్ముడయ్యాయి! ఆ తర్వాతి ఏడాది మళ్లీ ఇదే రోజు... అంటే సెప్టెంబర్ 1న ఈ నవల తొలిసారిగా పుస్తక రూపంలో వచ్చింది. ఆ తరువాత పులిట్జర్ అవార్డ్ గెలుచుకుంది. సాహిత్యంలో హెమింగ్వే నోబెల్ బహుమతి గెలుచుకునేలా చేసింది.

నవల విజయం హెమింగ్వేను ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమై, మరెన్నో ఉత్తమపుస్తకాలకు ప్రేరణగా నిలిచిన ఈ నవల శాంటియాగో అనే చేపలు పట్టే వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. వృద్ధుడి అలుపెరగని పోరాటం, విశాలమైన సముద్రం... నిజజీవితంలోని ఎన్నో మార్మికసత్యాలను తెలియజేస్తుంటాయి.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement