నిర్విరామ విహారిణి

Special story on Traveler Narmada Reddy - Sakshi

భ్రమణకాంక్ష

150 దేశాలు చుట్టొచ్చిన గృహిణి

మూడు దశాబ్దాలుగా విహార యాత్రలు

నాగరికత, కళలు, సంస్కృతిపై అధ్యయనం

అనుభవాలకు అక్షరరూపం

మనకున్న మహిళా యాత్రికులే తక్కువ. వారిలో నిరంతర యాత్రికురాలు నర్మదారెడ్డి. నర్మదకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లడం, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం, భిన్న సంస్కృతుల ప్రజల జీవనశైలిని ఆకళింపు చేసుకోవడం ఇష్టమైన అభిరుచులు. అనుభవం ఉన్న పర్యాటకులే Ðð ళ్లేందుకు సాహసించని ధ్రువ ప్రాంతాలైన అంటార్కిటికా, ఐస్‌లాండ్, నార్వేలలో కూడా ఆమె విహరించి వచ్చారు. అజర్‌బైజాన్, జార్జియా, సైబీరియా, మంగోలియాలతో పాటు చైనా, దక్షిణ కొరియా, మలేషియా, బ్రూనై, బల్గేరియా, రుమేనియా, గ్రీస్, ఇటలీ, క్రొయేషియాలను సందర్శించి అక్కడి విశేషాలను, వసతులను, ఆహారపు అలవాట్ల మూలాలను అధ్యయనం చేశారు. ఆ యాత్ర విశేషాలను తెలుపుతూ ‘ఆగదు మా ప్రయాణం’, ‘కొలంబస్‌ అడుగు జాడల్లో మా ప్రయాణం’ అనే పుస్తకాలు రాశారు. నర్మద గృహిణిగా ఉంటూనే న్యాయవాద విద్యను అభ్యసించారు.  నూటయాభై దేశాలను చుట్టి వచ్చారు. ఇటీవల కొలంబస్‌ ‘అడుగు జాడల్లో’ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు.

మార్క్‌ ట్వైన్‌.. కొలంబస్‌
నర్మద వివాహం అయినప్పటి నుంచి భర్త నోముల ఇంద్రారెడ్డితో కలిసి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ‘రిసార్ట్‌ కండోమినియమ్స్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ సభ్యులుగా చేరటంతో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆమె కల సులువుగా సాకారమైంది. ఇంచుమించు కొలంబస్‌ నడయాడిన ప్రాంతాలన్నీ ఆమె తిరిగొచ్చారు.  చైనాను ‘భూతల స్వర్గం’ అంటారు నర్మద. అక్కడి ప్రజల క్రమశిక్షణ, కట్టుబాట్లు, ట్రైన్‌లు, శుభ్రమైన రోడ్లు ఏ టూరిస్టును అయినా ఇట్టే ఆకర్షిస్తాయట. గొప్ప అనుభూతిని ఇచ్చింది మాత్రం నైబీరియన్‌ ట్రైన్‌ జర్నీ అట. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి చైనా, రష్యా, మంగోలియా మధ్య ఆరు రోజులు చేసిన ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేనని నర్మద అంటారు. ‘అన్వేషించు, కల గను, సాధించు’ అనే మార్క్‌ ట్వైన్‌ సందేశం నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. జీవితాన్ని కేరింతలు, తుళ్లింతలతో నవ్వుతూ ఆనందిస్తూ, నలుగురికి చేయూతనిస్తూ  జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆమె కోరిక. పర్యటనలు, విహారాలతో పాటు జీవిత చరమాంకం వరకు విద్యార్థినిగానే ఉండిపోవాలని ఆమె ఆశ. అందుకే ఎంఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేశారు. ఇప్పుడు పీహెచ్‌డీపై దృష్టి పెట్టారు. నర్మద ట్రావెలర్‌ మాత్రమే కాదు. మంచి గాయని కూడా. హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమాల్లో తరచూ పాల్గొని పాటలు పాడుతుంటారు. షటిల్‌ బ్యాట్మింటన్‌ ప్లేయర్‌ కూడా. స్టేట్‌ లెవెల్‌ పోటీలలో హైదరాబాద్‌ జట్టు నుంచి విజయం సాధించారు. అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.  

నర్మదను వరించిన పురస్కారాలు: ∙2015లో ‘ఉమన్‌ అచీవర్‌’ అవార్డు ∙ఉమెన్‌ ఆన్‌ గో (ప్రపంచాన్ని తిరిగే నిరంతర యాత్రికురాలు) అవార్డు ∙షటిల్‌ బాడ్మింటన్‌లో స్టేట్‌ లెవెల్‌ గోల్డ్‌ మెడల్‌ –2018 ∙సోషల్‌ సర్వీస్‌కు గాను ‘స్టార్‌ మహిళ’ అవార్డు ∙ఎల్‌ఎల్‌ఎంలో డిస్టింక్షన్‌. ఎల్‌ఎల్‌బీలో సిల్వర్‌ మెడల్‌.

నర్మద తిరిగొచ్చిన ప్రదేశాలలో కొన్ని
ప్రపంచంలో ఏడు వింతలైన మాచుపీచు, చైనా వాల్, బ్రెజిల్‌లోని రియోలో ఉన్న క్రీస్తు విగ్రహం, తాజ్‌మహల్, చిచెన్‌ ఇడ్డా (మెక్సికో), కొల్లీజియం (ఇటలీ), జోర్డాన్‌.  అనుకోకుండా చూసినవి మాత్రం ఆమ్‌స్టర్‌ డామ్‌లో తూలిప్‌ మొక్కలు, చైనాలోని టెర్రకోట మ్యూజియం, మంగోలియా ఇసుక సునామీలు, ఇటలీలోని ఒకే రకమైన ఇటుకలతో నిర్మించిన ఆల్బరాబెల్లోలోని పురాతన గ్రామం. ఇక దేశంలో అయితే.. అన్ని ముఖ్యపట్టణాలతో పాటు 18 శక్తి పీఠాలు, వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్, 12 జ్యోతిర్లింగాలు.  
– కోన సుధాకర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top