స్కూల్‌ టెస్ట్‌ టెన్షన్‌..?

School Test Tension ..? - Sakshi

సెల్ఫ్‌ చెక్‌

ఎగ్జామ్స్‌ మొదలవుతున్నాయంటే పిల్లలు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి పిల్లలు చురుగ్గా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి కల్పిస్తున్నారా?

1. పరీక్ష ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల నిద్ర తప్పని సరిగా పోయేటట్లు చూస్తున్నారు.
    ఎ. అవును     బి. కాదు 

2. టైమ్‌ అయిపోయిందని లేదా ఒత్తిడి కారణంగా తినాలనిపించక ఖాళీ కడుపుతో పరీక్షలకు వెళ్లిపోతుంటారు పిల్లలు. ఇది తప్పని మీకు తెలుసు. 
    ఎ. అవును     బి. కాదు 

3. తాజా పండ్లు, కూరగాయలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి పరీక్షల సమయంలో తప్పని సరిగా వీటిని తినిపిస్తున్నారు.
    ఎ. అవును     బి. కాదు 

4. పిల్లలు ఒకింత ఆందోళన కొద్దీ అన్నం తినడానికి విముఖత చూపిస్తూ ఆర్టిఫీషియల్‌ షుగర్స్‌తో చేసిన స్వీట్లు, ప్రాసెస్‌డ్‌ ఫుడ్, చిప్స్, వేపుడు పదార్థాలు, మాంసం వంటి చిరుతిళ్లను ఇష్టపడతారు. ఇవి ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి తిననివ్వకుండా జాగ్రత్తపడతారు.
    ఎ. అవును     బి. కాదు 

5. పిల్లలు తినకూడని వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచి తినవద్దు అని కండిషన్‌ పెడితే చిన్నబుచ్చుకుంటారు, ఆ మూడ్‌తో చదువు మీద దృష్టికేంద్రీకరించలేరు కాబట్టి పరీక్షల సమయంలో ఇంట్లోకి రానివ్వరు.
    ఎ. అవును     బి. కాదు 

6.    ఈ సమయంలో పిల్లలకు నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువ సేపు శక్తినిచ్చే మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేస్తున్నారు.
    ఎ. అవును     బి. కాదు 

7. పరీక్షల గురించి భయపెట్టకుండా జాగ్రత్తలను మాత్రమే చెబుతున్నారు, 
    ఎ. అవును     బి. కాదు 

8. ఉన్న సమయమంతా కూర్చుని చదవడమే కాకుండా రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయా మం చేస్తే మెదడు చురుగ్గా ఉంటుందని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లలను పరీక్షల ఒత్తిడికి లోనుకానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే ఒకసారి మనస్తత్వ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు చెప్పే విషయాలను గమనించండి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top