పేపర్‌ కప్స్‌ తోరణం

Prepare Beautiful Arches With Paper Cups - Sakshi

దీపావళి

దీపాల పండుగకు రంగు రంగుల అలంకరణ వస్తువులను సిద్ధం చేసుకునే పనిలో ఉండే ఉంటారు. ముఖ్యంగా విద్యుత్‌ తోరణాల జిలుగులకు ఎంతో ఖర్చు పెడుతుంటారు. తమదైన సృజన జోడించి పేపర్‌ కప్స్‌తో అందమైన తోరణాలను ఎవరికి వారు సిద్ధం చేసుకోవచ్చు.

►పార్టీలలో నీళ్లు, టీ, కూల్‌డ్రింక్స్‌ కోసం ఒకసారి ఉపయోగించి పడేసే పేపర్‌ కప్స్‌ని ఎక్కువ మొత్తంలో కొనేసి, వాడకుండా ఉన్నవి పక్కన పెట్టేస్తుంటారు. వాటిని ఈ విద్యుత్‌ తోరణాలకు వాడచ్చు. వాడేసిన కప్పులనూ తిరిగి ఇలా అందమైన తోరణాలుగా తయారుచేసుకోవచ్చు.

►ఒక్కో కప్పుకు ఒక్కో పెయింట్‌ వేయాలి. కప్పు అడుగు భాగాన చిన్న రంధ్రం చేయాలి. విద్యుత్‌ దీప తోరణాలకు ఈ కప్పులను జత చేయాలి. (లైట్‌ ఉన్న చోట కప్పును ఫొటోలో
చూపిన విధంగా ఇలా తిరిగేసి తొడగాలి)

►రంగేసిన టీ కప్పులకు పూసలు, చమ్కీలు, అద్దాలు ఉపయోగించి అందమైన తోరణాన్నీ తయారుచేసుకోవచ్చు. ఈ పేపర్‌ కప్స్‌ తోరణాలకు ఖర్చూ తక్కువే. వాడేసిన వాటిని తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని తగ్గుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top