అక్టోబర్ 7 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On October 7, the day of birth jarupukontunna Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 7 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 6 2015 10:55 PM | Updated on Sep 3 2017 10:32 AM

అక్టోబర్  7 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 7 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఈ సంఖ్యకి జ్ఞాన, మోక్షకారకుడు కేతువు అధిపతి కావడం వల్ల

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
జహీర్ ఖాన్ (క్రికెటర్), యుక్తా ముఖి (మాజీ ప్రపంచ సుందరి, నటి)

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఈ సంఖ్యకి జ్ఞాన, మోక్షకారకుడు కేతువు అధిపతి కావడం వల్ల నిరంతరం ఆలోచనలతో తత్వ విచారణ చేస్తుంటారు. వీరి పుట్టిన తేదీ కూడా 7 కావడం వల్ల కేతుప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తుల మీద అభిలాష కలుగుతుంది. మంచి విశ్లేషకులుగా, సద్విమర్శకులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు ఈ సంవత్సరం ఏకాంతంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. విదేశీ మిత్రుల సాయంతో సౌఖ్యవంతమైన జీవితం గడుపుతారు.

ఈ గురు, కుజ, శుక్రుల కలయిక వల్ల ఆస్తికి సంబంధించిన ప్రణాళికలు ఫలప్రదం అవుతాయి. అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతాయి. వీరు ఈ సంవత్సరం కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నర్సులు, డాక్టర్లు, పురోహితులు, జ్యోతిష్యులు, అధ్యాపకులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: గ్రే, పర్పుల్, బ్లూ, శాండిల్, ఎల్లో. లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: సిద్ధపురుషులు, సాధువులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లను ఆదరించి, గౌరవించడం వల్ల వీరికి వాక్‌శుద్ధి, సిద్ధి కలుగుతాయి.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement