వహ్ వా! | new dress models | Sakshi
Sakshi News home page

వహ్ వా!

Jun 23 2016 11:22 PM | Updated on May 24 2018 2:36 PM

వహ్ వా! - Sakshi

వహ్ వా!

ఏది చేసినా ‘వహ్ వా’ అనిపిస్తాడు అది కవిత్వం రాసినా దర్శకత్వం వహించినా సంప్రదాయ డిజైన్లు చేసినా...

ఏది చేసినా ‘వహ్ వా’ అనిపిస్తాడు అది కవిత్వం రాసినా  దర్శకత్వం వహించినా  సంప్రదాయ డిజైన్లు చేసినా...  లక్నవి టచ్‌తో సెలబ్రిటీ కట్‌తో  ఇంటర్నేషనల్ లుక్‌తో... ముజఫర్ అలీ కలెక్షన్ మీ కోసం వహ్ వా!

 

ఇటు చిత్రపరిశ్రమకు, అటు ఫ్యాషన్ ప్రపంచానికి చిరపరిచితమైన పేరు రాజా ముజఫర్ అలీ. లక్నోవాసి అయిన ముజఫర్ దర్శకుడిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్‌గానూ, కవిగానూ, ఆర్టిస్టుగానూ... ఎన్నో పాత్రలలో ఇమిడిపోయారు. లక్నో, కొత్వార కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ముజఫర్ చికన్, జర్దోసి, కందాని, టుక్డి, ఆప్లిక్, హ్యాండ్ ఎంబ్రాయిడరీలతోనూ ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఏడు పదుల వయసు దాటిన ముజఫర్ ‘రాజా ఆఫ్ కొత్వారా’ అనే పేరుతో తనదైన మార్క్ సృష్టించారు. ప్రాచీన భారతీయ వైభవాన్ని కళ్లకు కట్టడం ఈ డిజైనర్ ప్రత్యేకతే వేరు. మన దేశంలోని ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, బెంగళూర్, చెన్నై.. వంటి నగరాలలోనే కాకుండా సింగపూర్, లండన్, కువైట్, న్యూయార్క్ దేశాలలోనూ ఎన్నో ఫ్యాషన్ షోలలో తన ప్రతిభను చాటారు.

Advertisement
 
Advertisement
Advertisement