నన్నడగొద్దు ప్లీజ్‌  | Love doctor returns to answers | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Sep 21 2018 1:54 AM | Updated on Sep 21 2018 1:54 AM

Love doctor returns to answers - Sakshi

హలో సార్‌..! నాది విచిత్రమైన సమస్య. నేను మాయ అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను నన్ను ప్రేమించట్లేదని తెలుసు. కానీ నేను తనని వదులుకోలేకపోతున్నాను. తను నన్ను కేవలం మనీ ఇచ్చే వ్యక్తిగానే చూస్తోంది. తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. కానీ ప్రతి చిన్న దానిని పెద్దదిగా చూపించి నన్ను మనీ అడుగుతూనే ఉంటుంది. నేను ప్రేమించాను కాబట్టి ప్రతిసారీ చూసుకుంటున్నాను. ఈ మధ్య తనకి మంచి జాబ్‌ వచ్చిందట. ఆ విషయం నాకు చెప్పకుండా తన కష్టాలు చెప్పుకుంటూ నా దగ్గర మనీ అడుగుతూనే ఉంది. పైగా నేను తనకి ఇచ్చిన గిఫ్ట్స్‌ అన్నీ వేరే వాళ్లకు ఇచ్చేస్తోంది. ఇన్నీ చేస్తున్నా తనని మరచిపోలేకపోతున్నాను. తనని నిలదీసినా ఉపయోగం ఉండదు కదా! అందుకే తననేం అడగలేదు. సార్‌ ప్లీజ్‌..! నేను ఈ బాధ నుంచి, ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వండి. – రామ్‌
అమ్మాయి ఫొటో తీసుకో...!‘ఫొటో ఎందుకు సార్‌?’చెప్పనివ్వు....!‘అసలు అడిగితే ఇస్తుందా సార్‌ ఫొటో..???’కొంచెం ఓపిక పట్టు నీలాంబరీ!‘ఫొటో అడిగితే పీకి పట్టుకుంటుందేమో సార్‌?’ష్‌...ష్‌....ష్‌....!‘ఓకే సార్‌..! నేను సైలెంట్‌ అయిపోతాను. ఫొటోతో ఏం చెయ్యాలి సార్‌!’ ఫొటో తీసుకుని.....‘తీసుకుని... తీసుకుని..!!’దాన్ని గిఫ్ట్‌ పేపర్‌లో చుట్టి....‘చుట్టి.. చుట్టి..!?’చుట్టి.. చుట్టి... చుట్టి... అమ్మాయికే గిఫ్ట్‌గా ఇచ్చెయ్యి..!‘చుట్టి.. చుట్టి... చుట్టి... అమ్మాయికే గిఫ్ట్‌గా ఇచ్చెయ్యాలా?’అవును నీలూ! ఇదే ఫైనల్‌ గిఫ్ట్‌ అని చెప్పి.. తన మనస్సులో నుంచి తన ఫొటోను తీసేశానని చెప్పి... నరసింహ సినిమాలో రజనీకాంత్‌లా ‘వెయ్యి ఎత్తుకు పైఎత్తు – చెయ్యి గిఫ్ట్‌తో గేర్‌ షిఫ్ట్‌..’ అని పాడుకుంటూ స్టైల్‌గా ఎగ్జిట్‌ కొట్టు రామ్‌..!‘సార్‌.. ఆ పాట ‘ఎక్కు తొలి మెట్టు.. కొట్టు కొండను ఢీ కొట్టు.. జీవితమంటే పోరాటం..’
తెలుసు నీలాంబరీ..! కానీ ఈ సిట్యుయేషన్‌లో ‘ఎత్తుకు పై ఎత్తు’ చాలా అవసరం. అమ్మాయిని గుండెల్లో నుంచి పీకి.. ఫ్రేమ్‌ కట్టి.. అమ్మాయి ముఖాన్న పారేసి... స్టైల్‌గా నడుస్తుంటే ఉంటుంది నా సామిరంగా..!!...రామ్‌..! ప్రేమ ఎప్పటికీ తరగని గిఫ్ట్‌లా ఉండిపోవాలి గానీ ఎప్పటికీ తరగని గిఫ్టుల లిస్ట్‌ కాకూడదు..! ‘అబ్బా..! ఏం చెప్పారు సార్‌..! ఇదిగోండి అరటిపండ్ల గిఫ్ట్‌’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement