రారండోయ్‌

Literature Events In Telugu States - Sakshi
  •     ‘షేక్‌ మహమ్మద్‌ మియా, కె.ఎల్‌.నర్సింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక 2018 రొట్టమాకురేవు కవిత్వ’ అవార్డుల ప్రదాన సభ అక్టోబర్‌ 7న ఖమ్మం జిల్లా, కారేపల్లి, రొట్టమాకురేవులో జరగనుంది. స్వీకర్తలు: నారాయణస్వామి(వానొస్తద?), బొల్లోజు బాబా(వెలుతురు తెర), నిర్మలారాణి తోట(ఒక చినుకు కోసం). చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌కు సత్కారం, కొత్తతరం కవులతో సంభాషణ ఉంటాయి. అతిథులు: కె.శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, ఖమర్‌. అధ్యక్షత: ప్రసేన్‌.
  •     మొవ్వ వృషాద్రిపతికి ‘మహాకవి’ గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక 37వ సాహిత్య పురస్కారాన్ని అక్టోబర్‌7న సాయంత్రం 5:30కు ప్రొద్దుటూరులోని అనీబిసెంటు పురపాలకోన్నత పాఠశాలలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: గడియారం కుటుంబీకులు మరియు రచన సాహిత్య వేదిక, కడప.
  •     రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ‘నుడి–గుడి’ భాషా పరిశోధన గ్రంథం ఆవిష్కరణ అక్టోబర్‌ 14న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభ మినీ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఆచార్య ఎన్‌.గోపి. నిర్వహణ: రాజా వాసిరెడ్డి ఫౌండేషన్‌ మరియు త్యాగరాయ గానసభ.
  •     సలీం ‘ఎడారిపూలు’, ‘మాయ జలతారు’ ఆవిష్కరణ అక్టోబర్‌ 7న ఉదయం 10:30కు విశాఖపట్నం పౌర గ్రంథాలయం మినీ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఆచార్య వి.సిమ్మన్న. నిర్వహణ: మొజాయిక్‌ సాహిత్య సంస్థ.
  •   సత్య–మూర్తి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు ‘మోదు గురుమూర్తి స్మారక పురస్కారం’ కోసం 2015–18 మధ్య ప్రచురించిన కవితా సంపుటాల 4 ప్రతులను అక్టోబర్‌ 31లోగా .. ట్రస్ట్, జుత్తాడ కాలనీ, పెందుర్తి, విశాఖపట్నం–531173 చిరునామాకు పంపాలని కోరుతున్నారు. నలుగురు కవులకు పురస్కార ప్రదానం నవంబర్‌ 19న. ఫోన్‌: 8333807116 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top