గార్డెన్‌ కుర్తీ

Lawn Dressing is the Right Choice for Summer - Sakshi

నిజానికి వీటి పేరు లాన్‌ కుర్తీస్‌ఎంత ఎండ ఉన్నా అందమైన గడ్డిపువ్వుల్లామెరిసిపోతుంటాయి.జీన్స్, పలాజో, లెగ్గింగ్, జెగ్గింగ్‌స్లిమ్‌ ఫిట్, టైట్‌ ఫిట్‌..బాటమ్‌గా ఏది ఎంచుకున్నాపైన ఈ టాప్‌ వేసుకుంటే చాలు గార్డెన్‌ అంత ముచ్చటగా ఉంటుంది.

►ఈ లాన్‌ కుర్తీలు ఎవరికైనా నప్పుతాయి. వయసు తేడాలు అవసరం లేదు. చూడటానికి ఫ్రాక్‌లా ముచ్చటగా ఉంటాయి. వేసుకుంటే మాత్రం స్టైలిష్‌గా కనిపిస్తాయి. కంఫర్ట్‌లో ప్రత్యేకం అనిపిస్తాయి. గాఢమైన రంగులు, ప్రింట్లు పెద్దగా హంగామా లేనివి ఎంచుకోవాలి. వీటికి లైట్‌ ట్రౌజర్, ధోతీ ప్యాంట్‌ బాటమ్‌గా ధరించాలి. క్యాజువల్‌గా బయటకు వెళ్లినా, ఈవెనింగ్‌ పార్టీ అయినా లాన్‌ డ్రెస్సింగ్‌ సమ్మర్‌కి సరైన ఎంపిక అవుతుంది.

►ఆభరణాల హంగులు అవసరం అని భావిస్తే ఫ్యాషన్‌ జ్యువెల్రీలో భాగంగా సిల్వర్, ఉడెన్‌.. ఆభరణాలను ఎంచుకోవాలి. అవి కూడా చాలా డ్రెస్‌ను హైలైట్‌ చేసేలా ఉండేలి. 

►డ్రెస్‌ ఎంపికలోనే ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి వీటికి జ్యువెలరీ హంగులు అవసరం లేదు. సాదా సీదా హెయిర్‌ స్టైల్, ఫుట్‌వేర్‌ ఎంపికలు ఈ గార్డెన్‌ కుర్తీలకు బెస్ట్‌ ఎంపిక. . 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top