ఊ... లలలా... కాజోల్‌ ఇలా...

kajol fashion dresses - Sakshi

వయసుతో పాటు అందం పెరగాలంటే..
హుందాగా ఉండాలి.
హుందాతనాన్ని మించిన అందం
దుస్తులకు ఇంకెక్కడ దొరుకుతుంది..
దిష్టి తగిలేలా కనబడటం లేదా కాజోల్‌!
అందుకేనేమో ఆ పేరు పెట్టారు.. కాటుక అని!

సాధారణంగా ఉంటూనే అసాధారణంగా  ఇలా రెడీ అవ్వచ్చు. ప్లెయిన్‌ బ్రౌన్‌ స్కర్ట్‌ మీదకు, ప్లెయిన్‌ ట్రెంచ్‌ కోట్‌ ధరించే ఈ స్టైల్‌ ఇండోవెస్ట్రన్, గెట్‌ టు గెదర్, బర్త్‌డే వంటి ఈవెనింగ్‌ పార్టీలకు బాగా నప్పుతుంది.

సంప్రదాయ వేడుకలకు సింపుల్‌గా రెడీ అవాలంటే ఈ తరహా డిజైనర్‌ దుస్తులు బాగా నప్పుతాయి. లాంగ్‌ కుర్తీకి అంచు భాగం ధోతీ స్టైల్, రంగు హుందాతనాన్ని తీసుకువచ్చింది.

లాంగ్‌ ఫ్రంట్‌ ఓపెన్‌ కుర్తీ. సైడ్స్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మెరిపించి, మిగతా అంతా సింపుల్‌గా డిజైన్‌ చేశారు. దీనికి బాటమ్‌గా షిమ్మర్‌ లెగ్గింగ్‌ లేదా లాంగ్‌ స్కర్ట్‌ ధరిస్తే పార్టీలకు బాగా నప్పుతుంది.

శారీ మీదకు ఓవర్‌ కోట్, సన్నని బెల్ట్‌తో ఈ స్టైల్‌ తీసుకురావచ్చు. అయితే శారీ, జాకెట్‌ రెండూ పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండాలి. బాందినీ ప్రింట్‌ శారీ, పైన మెటాలిక్‌ ఆప్లిక్‌ వర్క్‌ చేసిన జాకెట్‌  ధరిస్తే సూపర్‌ పవర్‌ ఉమన్‌లా కనిపిస్తారు.
 

ఇది క్యాజువల్‌ లుక్‌. నలభైలలో ఉన్న అతివలకు హుందాగానూ, గ్రాండ్‌గా అనిపించే ఈ లుక్‌కి ప్లెయిన్‌ కుర్తా, పలాజో ప్యాంట్స్‌ ఎంపిక చేసుకొని, ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసిన దుపట్టా ధరిస్తే చాలు.

బ్లాక్‌ కలర్‌ ఎప్పుడూ ఫంక్షన్‌లలో రిచ్‌గా ఉంటుంది. దీనికి కొంచెం అదనపు హంగులు అద్దడానికి నెట్‌ ఫ్యాబ్రిక్‌ మీద సీక్విన్‌ వర్క్‌ చేశారు. సింపుల్‌ బ్లౌజ్‌ వేయడంతో రిచ్‌ లుక్‌ వచ్చేసింది.

భార్గవి కూనమ్‌
డిజైనర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top