అమ్మ తొమ్మిదిసార్లు చూసింది

Hrithik Roshan Mother Watched Super 30 Movie 9 Times  - Sakshi

సూపర్‌ 30

‘‘నేను నటించిన ‘సూపర్‌ 30’ చిత్రాన్ని మా అమ్మ తొమ్మిదిసార్లు చూసింది’’ అంటున్నారు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌. పాట్నాకు చెందిన ఆనంద్‌ కుమార్‌ అనే గణితశాస్త్రవేత్తకు సంబంధించిన కథ ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రాన్ని హృతిక్‌ రోషన్‌ తల్లి పింకీ రోషన్‌ థియేటర్‌లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు చూశారట. ‘ఆనంద్‌ సార్‌ని, ఆయన సోదరుడు ప్రణవ్‌ను ఇంతవరకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం దొరకలేదు’ అని తన తల్లి అన్నారని కూడా హృతిక్‌ తెలిపారు. మొత్తానికి సూపర్‌ 30 సక్సెస్‌ మీట్‌తో ఆవిడ కోరిక నెరవేరింది.  కొంతకాలం క్రితమే ఈ చిత్రం విడుదలైంది. ఆనంద్‌కుమార్‌ అనే 46 సంవత్సరాల మాథమెటీషియన్‌ మీద ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనంద్‌కుమార్‌కు, ఆయన సోదరుడు ప్రణవ్‌కుమార్‌కు సక్సెస్‌ మీట్‌లో తన తల్లిని పరిచయం చేశారు హృతిక్‌ రోషన్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top