
మునగకాడల గురించి మనకు బాగానే తెలుసు. అయితే మునగ ఆకులు, చెట్టు బెరడు, వేర్లు కూడా ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసా? లేత మునగ చిగుళ్లను రుబ్బి రసం తీసి, రోజూ పరగడుపున చిన్న గ్లాసుడు తాగితే బరువు తగ్గుతారు.
►మునగ చెట్టు బెరడు నుంచి తీసిన జిగురును ఆవుపాలతో కలిపి నుదుటి మీద పట్టీలా వేస్తే తలనొప్పి మాయమవుతుంది. మునగచెట్టు వేరును దంచి, రసం తీసి, తేనెలో కలిపి తాగితే వాతపు నొప్పులు తగ్గుతాయి.
►లేత మునగాకును తరచుగా తింటే ఒంటికి పట్టిన నీరు తీసేస్తుంది. మునగాకును వేయించి తినిపిస్తే, పిల్లలు పక్క తడపడం మానేస్తారు. మునగాకును, కాడలను మెండుగా తీసుకుంటే బాలింతలకు పాలు బాగా పడతాయి. ఆకును ఎండబెట్టి, పొడి చేసి పరగడుపునే ఓ చెంచాడు తింటే.. కడుపులో ఉన్న అల్సర్లు మానిపోతాయి.
నిమ్మ
►నిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు శరీరంలోని మలినాలను పారద్రోలతాయి.
► ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే, అజీర్తి సమస్య తొలగిపోతుంది.
►ఎక్కిళ్లు ఆగకుండా వస్తుంటే... రెండు చెంచాల నిమ్మరసంలో, రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే వెంటనే ఆగిపోతాయి.
►నిమ్మరసానికి కాసింత తేనె, వాము పొడి, సున్నపుతేట కలిపిన నీటినిమూడు పూటలా తాగితే... కడుపులోని నులి పురుగులు చచ్చిపోతాయి. లవంగాల పొడిలో నిమ్మరసం కలిసి పేస్టులా చేసి పూస్తే చిగుళ్ల నొప్పి మాయమవుతుంది. పంటి నొప్పికి కూడా ఇది మంచి మందు.