ఎప్పటికీ మీ కోసం... | Diamond Comics | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ మీ కోసం...

Oct 15 2014 10:27 PM | Updated on Sep 2 2017 2:54 PM

ఆభరణాలలో వజ్రాభరణం మొదటి వరుసలో ఉంటుంది. కారణం- వజ్రం అరుదైనది. కాంతులీనుతూ ఉండేది. ఖరీదైనది. ఎన్నేళ్లైనా వన్నెతగ్గనిది. విలువ తగ్గనిది.

వజ్రం

బామ్మల కాలంలో వజ్రాభరణాల గురించి చెప్పేటప్పుడు రవ్వల ముక్కుపుడక, రవ్వల దుద్దులు.. అంటూ గొప్పగా చెప్పేవారు. రవ్వల నెక్లెస్ అంటూ అపురూపంగా చెప్పినా, వజ్రాల హారం అంటూ గొప్పలు పోయినా అప్పటికీ ఇప్పటికీ ఆభరణాలలో అత్యంత విలువైనదిగా ‘వజ్రం’ కాంతులీనుతూనే ఉంది. ఈ నెల 21న ధన్‌తేరస్. ఈ వేళ ఆభరణాలు కొనడం శుభకరమని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా మగువలు ముచ్చటపడే ‘వజ్రం’ గురించి విలువైన మాటలు...
 
ఆభరణాలలో వజ్రాభరణం మొదటి వరుసలో ఉంటుంది. కారణం- వజ్రం అరుదైనది. కాంతులీనుతూ ఉండేది. ఖరీదైనది. ఎన్నేళ్లైనా వన్నెతగ్గనిది. విలువ తగ్గనిది. ఈ సుగు ణాలు ఎప్పటికీ మారకపోవడం వల్లనే ప్రాచీన కాలం నుంచి వజ్రం మహిళకు ప్రియమైన నేస్తంగా వెలుగొందుతోంది. మహిళలే కాదు వజ్రాన్ని ఆభరణంగా ధరించాలని మగవారూ ముచ్చటపడుతుంటారు. మగువల మనసు గెలుచుకోవడానికి మగవారు వజ్రాలను కానుకగా ఇస్తూ ఉంటారు. బంధాలను పటిష్టపరిచే వజ్రం కొనుగోలు పట్ల ఆసక్తి చూపడం సరే కానీ, వీటిలో మోసాలు కనిపెట్టకపోతే నష్టపోవాల్సి ఉంటుంది అంటున్నారు ఆభరణాల నిపుణులు. అమూల్యమైనవి కావడంతో వజ్రాల అమ్మకాలలో మోసాలూ ఎక్కువే! అందుకే వజ్రం కొనుగోలు కత్తిమీద సామే! కొన్ని మెలకువలు పాటిస్తే వజ్రం ఎంపిక సులువు అవుతుంది.
 
నాణ్యమైన పరిశీలన: వజ్రాలలో బెల్జియమ్ కట్‌కు అత్యంత నాణ్యమైనదిగా పేరుంది. ఆ తర్వాత వరుసలో బాంబేకట్, ఆ తర్వాత సూరత్ కట్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి.

బంగారం స్వచ్ఛతకు 9.16, హాల్‌మార్క్ ప్రామాణికంగా చూస్తారు. అలాగే వజ్రాన్ని సెంట్స్, క్యారెట్స్‌ను బట్టి విలువ కడతారు.

వజ్రం కొనుగోలులో ముఖ్యంగా 4సి ల పైన దృష్టిపెట్టాలి. అటు తర్వాత సర్టిఫికెట్, ధర ఆధారంగా వజ్రాన్ని కొనుగోలు చేయాలి అని సూచిస్తున్నారు వజ్రాభరణాల నిపుణులు. నగల దుకాణంలో వజ్రాలను నల్లని రంగు పేపర్ మీద వేసి, వాటి మెరుపును పరిశీలించాలి. అప్పుడు వజ్రం వెనకవైపు కూడా పారదర్శకంగా ఉంటే దాన్ని నాణ్యమైనదిగా గుర్తించాలి.
 
డైమండ్ వినియోగంలో అవగాహన అవసరం...

వజ్రాభరణాలను కొనడంలోనే కాదు, వాటిని వినియోగించడంలోనూ అవగాహన అవసరం. లేని పక్షంలో ఎంతో వెచ్చించి కొన్నవి కూడా కళ కోల్పోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు వేలి ఉంగరాలను చాలా మంది తీసి పెట్టడం చేస్తారు. అలాంటి సమయంలో సరైన విధంగా పట్టుకోకపోతే శరీరానికి ఉండే సహజమైన ఆయిల్స్ డైమండ్‌పై ప్రభావం చూపుతాయి. ఆభర ణాలను మరీ వారానికోసారి క్లీన్ చేయడం అనవ సరం. నెలకోసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్‌కు షాంపూ వాడవచ్చు. ఆల్కహాల్ అయితే మరింత ప్రభావం చూపుతుంది. ఎక్కడైతే వజ్రాభరణాన్ని కొనుగోలు చేశారో వారికే ఆరు నెలలకు ఒకసారి ఇస్తే మిషన్ క్లీనింగ్ చేసి ఇస్తారు.
 - సీమా మెహతా, వజ్రాభరణాల నిపుణులు, కోయంబత్తూర్
 
సర్టిఫికెట్: సదరు ఆభరణాల దుకాణదారులు వజ్రం క్యారెట్స్, క్వాలిటీ, కట్, కలర్.. వీటన్నింటినీ తెలుపుతూ సర్టిఫికెట్ ఇస్తారు. ఏ వజ్రాభరణం కొనుగోలు చేసినా దాని మీద క్యారెట్స్, కంపెనీ సీల్ ఉండాలి. అలాంటి ఆభరణాలకు తిరిగి అమ్మేటప్పుడు ఇబ్బందులు ఎదురవ్వవు.
 
పెద్ద, ప్రముఖ వజ్రాభరణాల షాపులు  కొనుగోలు చేసిన ఆభరణాలను ఎక్కడైనా తిరిగి రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
 
చిన్నషాపులు వజ్రాభరణాలకు ఇచ్చే భారీ డిస్కౌంట్లను చూసి కొనుగోలుదారులు మోసపోకూడదు. ఏ ఆభరణాన్ని కొనుగోలు చేసినా దాని మీద ‘క్యారెట్లు, కంపెనీ సీల్’ తప్పక చూసుకోవాలి. అలాగే బంగారం నాణ్యత, స్వచ్ఛతలను తెలిపే బిల్లు, సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
 
 బాంబే కట్, సూరత్ కట్.. ఎంపిక చేసుకున్న సదరు ఆభరం పై ఆ పేరు ఉండాలి.
 
 వజ్రాలలో తొమ్మిది గ్రేడ్‌లు ఉంటాయి. వాటిలో ‘వివిఎస్ 1’ అని వజ్రం అత్యంత విలువైనది.
 
తరుగు కూడా చూడాలి...: 4ఇలతో పాటు, తరుగు(వేస్టేజ్), తయారీ(మేకింగ్), సర్టిఫికెట్.. ఇవి చూసుకుని వజ్రాభరణాలను నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. బంగారు ఆభరణాలలో తరుగు ఉంటుందని మనందరికీ తెలిసిందే! అలాగే వజ్రాలలోనూ తరుగు ఉంటుంది. వజ్రాభరణాన్ని కొనుగోలు చేసేటప్పుడు బంగారం తరుగు, వజ్రం తరుగు రెండూ సరిచూసుకొని ఎంపిక చేసుకోవాలి. తరుగు లేదంటే అందులో మోసం ఉందని గ్రహించవచ్చు. వజ్రాభరణాల తయారీలో 18 క్యారెట్ల, 20 క్యారెట్ల బంగారం వాడుతుంటారు.               
- మధుసూదన్, వజ్రాభరణాల నిపుణులు, హైదరాబాద్

 
 4cలతో వజ్రాన్ని అంచనా వేసే విధానం....

 1. క్యారట్ (Carat): బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో చెబుతారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనదిగా మనకు తెలుసు. అలాగే వజ్రాన్నీ సెంట్స్, క్యారెట్స్‌లలో లెక్కిస్తారు. 100 సెంట్స్ 1 క్యారెట్ అవుతుంది. ఒక క్యారెట్ 0.2 గ్రాముల బరువు ఉంటుంది.  క్యారెట్స్ సంఖ్య పెరుగుతున్న కొద్ది ఆ వజ్రం ఖరీదు కూడా పెరుగుతుంటుంది. చాలా వరకు విలువైన వజ్రాలుగా భావించే రాళ్ల పరిమాణం లేదా ఆకారం ఒకే విధంగా ఉండవచ్చు. కానీ బరువులో మాత్రం తేడా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద వజ్రాల క్యారెట్ విలువ ఎక్కువ ఉంటుంది.
 
 2. క్లారిటీ (Clarity): వజ్రం స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలి. కొన్ని వజ్రాలలో రంగు మచ్చలు, గుర్తులు ఉంటాయి. కొన్ని సార్లు అవి మన కంటికి కూడా కనపడకపోవచ్చు. అలాంటి వాటిని మైక్రోస్కోప్ సాయంతో చూడవచ్చు. కొనేటప్పుడు ఎలాంటి మచ్చలు లేని వజ్రాన్ని ఎంచుకోవాలి. వీటిలోనూ భిన్నమైన గ్రేడ్స్ ఉంటాయి.
 
 3. కలర్ (Colour): ఏ రంగూ లేని వజ్రమే అత్యంత మేలైనది. కొన్ని వజ్రాలలో కొద్దిగా పచ్చ రంగు కనిపిస్తుంటుంది. వజ్రాలలో  ఈ నుంచి ో వరకు వర్గీకరణ ఉంటుంది. చీఈ’వర్గంలోనివి రంగు ఉండవు. చీో’ వర్గంలోనివి కొద్దిగా పసుపుగా ఉంటాయి.
 
 4. కట్స్ (Cuts): వజ్రం కట్స్‌ను బట్టే ఎంత ఫ్యాషన్‌గా ఉంది అనేది నిర్ధారిస్తారు. కట్స్‌ను బట్టి వజ్రం కాంతి కూడా పెరుగుతుంది. కట్ డైమండ్స్‌లో ‘పూర్, ఫెయిర్, గుడ్, వెరీ గుడ్’ అని ఉంటాయి.
 
 - నిర్వహణ: నిర్మలారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement