
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత గానసర గ్రామానికి చెందిన వలరోతు భాస్కర్‌రావు 2 ఎకరాల సొంత భూమికి తోడు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలు సాగు చేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం వచ్చింది. కూతురు ఝాన్సీ పెళ్లికి రూ. లక్ష అప్పు అయ్యింది. పంటలకు చేసిన అప్పు రూ. 2 లక్షలు కలసి.. మొత్తం ప్రైవేటు అప్పు రూ. 3 లక్షలు. వడ్డీ నెలకు నూటికి 3 రూపాయలు.
ఇక అప్పుల బాధ తీరదని భావించిన భాస్కర్‌రావు 2014 డిసెంబర్ 24న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లు దాటిపోయింది. కానీ, భాస్కర్‌రావు భార్య లక్ష్మికి ఇంతవరకూ వితంతు పింఛను కూడా రావటం లేదు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ.