మధ్యాహ్నపుటెండ

 afternoon the sunny is severe - Sakshi

చెట్టు నీడ  

ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు  ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ  కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది  వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ  వెనక్కి వచ్చింది.

ఒక యువకుడు చెరువు వైపు నడుచుకుంటూ పోతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. అతడు చాలా దిగులుగా ఉన్నాడు. తాను అనుకున్నది ఏమీ చేయలేకపోతున్నాననే వేదన అతడిని వెంటాడుతోంది. అదే చింతిస్తూ గట్టున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడో కుక్క అటుగా వస్తోంది. ఎండకు అకరు కొడుతోంది. గట్టు దిగి చెరువు దగ్గరికి వెళ్లింది. అది దప్పికతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నీళ్ల దాకా వెళ్లింది. ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. అది దాని నీడను చూస్తోంది, అది మరో కుక్క అని భ్రమించి, భయపడుతోంది.

ఏం జరుగుతుందా అని యువకుడు మరింత కుతూహలంతో చూస్తున్నాడు. కుక్క మళ్లీ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, నీటి దాకా పోయింది. ఈసారి అరుపులో అంత తీవ్రత లేదు. దానికదే ఒక రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా, ముందు కొంచెం అనుమానంగా, తర్వాత తాపీగా నీళ్లను తాగి వెనక్కి వెళ్లిపోయింది. తన  నీడను శత్రువుగా భావించిన కుక్క దాన్ని జయించగలిగింది. తాను సాధించవలసిన దానికి తానే అడ్డంకిగా ఉన్నానని నిశ్చయానికి వచ్చిన యువకుడు స్థిరంగా లేచి నిలబడ్డాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top