పాలమూరులో పాగా వేసేదెవరు? | Sakshi
Sakshi News home page

పాలమూరులో పాగా వేసేదెవరు?

Published Sun, Apr 20 2014 1:44 AM

పాలమూరులో  పాగా వేసేదెవరు? - Sakshi

మహబూబ్‌నగర్ స్థానం నుంచి జె.రామేశ్వర్‌రావు, ఎం. మల్లిఖార్జున్, ఎస్.జైపాల్ రెడ్డి,  కె.చంద్రశేఖర్‌రావు వంటి ఉద్ధండులు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించారు. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలోనే ఉండడం ప్రత్యేకత. ఈసారి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కేటాయింపు, బీసీలు, బీడీ కార్మికుల సమస్యలు, తాగునీరు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయి. తెలంగాణ వాదంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మోడీ గాలిపై బీజేపీ, దివంగత సీఎం వైఎస్ పథకాలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
 
 లోక్‌సభ నియోజకవర్గం
 మహబూబ్‌నగర్
 
మొత్తంఓటర్లు
 13,91,365

 పురుషులు
 6,96,235

 మహిళలు
 6,95,015
 
ఇతరులు
 115
 
 కల్వల మల్లికార్జున్‌రెడ్డి-వుహబూబ్‌నగర్
 
సుదీర్ఘ రాజకీయ అనుభవవుున్న నేతలే ఇక్కడ బరిలో ఉన్నారు.  ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్), ఏపీ జితేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ) జిల్లా నుంచి చట్టసభలకు ఎన్నికైన చరిత్ర ఉంది. ఎమ్మెల్సీగా పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.ఎ.రెహమాన్ మాత్రం తొలిసారిగా మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చతుర్ముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల వ్యూహ, ప్రతివ్యూహాలతో పోటీ రసవత్తరంగా మారింది.
 
వర్గ విభేదాలే అసలు తలనొప్పి

 1984లో జనతా, 1998లో జనతాదళ్ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీగా ఎన్నికైన జైపాల్‌రెడ్డి దశాబ్దంన్నర తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీలో తిరుగుబాట్లు, అలకలు, వర్గపోరు తలనొప్పిగా మారింది. టికెట్ దక్కకపోవడంతో గురునాథ్‌రెడ్డి (కొడంగల్) టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎం.రమేశ్ రెడ్డి తదితర కీలక నేతలు టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ వర్గీయులు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తుండడంతో వారి సహకారంపై జైపాల్‌రెడ్డి వర్గీయుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జైపాల్‌రెడ్డి చక్రం తిప్పి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారని పార్టీ శ్రేణులు అంచనావేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మకాం వేసి జోరుగా మంతనాలు సాగిస్తున్నారు.

 వలసలతో గులాబీ దళం జోరు

 ఎన్నికల ప్రక్రియుకు ముందు బలహీనంగా కనిపించిన టీఆర్‌ఎస్ అగ్రనేతల రాకతో ఒక్కసారిగా బలం పుంజు కుంది. అసెంబ్లీ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో ఎంపీ అభ్యర్థి జితేందర్‌రెడ్డి సునాయాస ప్రచారానికి సిద ్ధమవుతున్నారు. 1999లో బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన జితేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటి ప్రత్యర్థే అరుున కేంద్ర మంత్రి  జైపాల్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. గతంలో బీజేపీ, టీడీపీలో పనిచేసిన అనుభవం, పరిచయాలు, తెలంగాణ వాదం ప్రస్తుత ఎన్నికల్లో కలిసివస్తాయని జితేందర్‌రెడ్డి అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో పార్టీ టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో జితేందర్‌రెడ్డి తనకున్న పరిచయాలు, పలుకుబడితో నేరుగా ఓటర్లను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
 
వైఎస్ పథకాలపై కొండంత ఆశ

 మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ తొలిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సుమారు రెండున్నర లక్షల మంది మైనార్టీ ఓటర్లు తవుకు అండగా నిలుస్తారనే ధీవూతో ఉన్నారు. మైనార్టీలకు విద్య, ఉద్యోగ నియూవుకాల్లో వైఎస్ రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ప్రచారంలో ప్రధాన అంశంగా చేసుకుంటున్నారు. వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోబాటు, వుుస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారంలో వుుందుకు సాగుతున్నారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్ పట్టణ ప్రాంత ఓటర్లలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓటర్లపై రెహమాన్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.  
 
పొసగని పొత్తుతో కమలం తంటాలు

 ఎమ్మెల్యేగా ఆరు సార్లు నాగర్‌కర్నూలు నుంచి గెలిచిన నాగం జనార్దన్‌రెడ్డి తొలిసారి ఎంపీగా బీజేపీ పక్షాన బరిలో ఉన్నారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు వైఖరిని వ్యతిరేకించి టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయుం తెలిసిందే. బీజేపీ, టీడీపీల పొత్తుతో తిరిగి పచ్చ కండువాను కూడా మెడలో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో గతంలో వారితో విభేదించిన నాగం జనార్దన్‌రెడ్డి తిరిగి వారి మద్దతు కోరాల్సిన పరిస్థితి నెలకొంది. సీమాంధ్రలో బీజేపీ, టీడీపీ పొత్తు డోలాయమానంలో పడటంతో స్థానికంగా రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయడం అనుమానంగానే కనిపిస్తోంది. టికెట్ దక్కని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి నారాయణపేటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన జనార్దన్‌రెడ్డి ప్రతికూలతలు ఎలా అధిగమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
 
 ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
 
 అనుకూలం
1.  సుదీర్ఘ రాజకీయ అనుభవం
2.    {పతికూలతను అధిగమించే వ్యూహాలు
3.    తెలంగాణ కోసం లాబీయింగ్ చేశాననే ప్రచారం
4.    అనుచరగణం, బంధుగణం అండ
 ప్రతికూలం
5.   సొంత పార్టీలో అలకలు, తిరుగుబాట్లు
6.  రెండు సార్లు గెలిపించినా పొరుగు జిల్లాలకు వలస
7.   జిల్లా అభివృద్దికి ఏమీ చేయలేదనే అపవాదు
8.    {పజలకు అందుబాటులో లేకపోవడం
 
9.  పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
10    పాలమూరు ఎత్తిపోతల  పథకానికి నిధులు
 11.   వలసల నివారణకు ప్రణాళికలు
12.   జిల్లా సర్వ సమగ్రాభివృద్ధి
 
 నాగం జనార్దన్‌రెడ్డి (బీజేపీ)
 
 అనుకూలం

1. ఎమ్మెల్యేగా ఆరు పర్యాయాలు ఎన్నికైన అనుభవం
2.    టీడీపీ, బీజేపీ శ్రేణులతో విస్తృత సంబంధాలు
3.   తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా
4.    నరేంద్రమోడీ అనుకూల పవనాలు  ప్రతికూలం
5.   టీడీపీ, బీజేపీ పొత్తులు వికటించడం
 6.    పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండటం
7.   సొంత పార్టీలో తిరుగుబాట్లు
8.    {పజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం
 9.   ఎత్తిపోతల పథకాల పూర్తి
10    విద్యుత్ కొరత లేకుండా చూడటం
 11.    జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
 
 ఏపీ జితేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
 
 అనుకూలం
 1.    తెలంగాణ వాదం, విస్తృత పరిచయాలు
2.    గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులు
3.    అసెంబ్లీ స్థానాల్లో బలమైన పార్టీ అభ్యర్థులు
4.    ఆర్దిక వనరులు పుష్కలంగా ఉండటం ప్రతికూలం
5.    పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం
6.    కేవలం తెలంగాణవాదంపైనే ఆధార పడటం
7.   {పచారంలో సమన్వయ లోపం
8.    పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి
9.   ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు
 10    వ్యవసాయ అనుబంధ
 పరిశ్రమల ఏర్పాటు
 11.    ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ద్వారా ఉపాధి
 
 హెచ్‌ఎ రెహవూన్ (వైఎస్సార్‌సీపీ)
 

 అనుకూలం
1.    మాజీ ఎమ్మెల్సీ, మైనార్టీ నేతగా గుర్తింపు
2.   వైఎస్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులపై  ప్రజల్లో సానుకూలత
3.    ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం
4.    మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటం  ప్రతికూలం
5..   ఎన్నికల సమయంలో జిల్లాకు రావడం
6.    దివంగత సీఎం వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాల అమలు
7.    జిల్లాలో ఎత్తిపోతల పథకాల పూర్తికి నిధుల సాధన
8.  వలసల నివారణకు ఉపాధి కల్పించే ప్రణాళిక
9.    తాగునీటి పథకాలకు రూపకల్పన
 

Advertisement
Advertisement