ఆ స్వరం ...సమైక్యం

ఆ స్వరం ...సమైక్యం - Sakshi


జనం గొంతుకైన ఒకే ఒక్కడు

 కటకటాల్లోంచే సమైక్య శంఖారావం

 దేశమంతటినీ ఒక్కటి చేసేలా ఉద్యమం

 జాతీయ స్థాయిలో సమైక్యానికి మద్దతు


 

 ‘విభజించండి గానీ, సరిహద్దు రాళ్లూ అవీ కాస్త స్పష్టంగా కన్పించేలా వెనకా ముందూ చూసుకుని విభజించండి’ అని చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతి ఒకరు  ‘విభజిస్తారా?’ అంటూ ఆవేశపడుతూనే, ముఖ్యమంత్రి హోదాలో విభజనకు అన్ని విధాలా సహకరించి తరించిన...



 ముసుగు వీరుడు, ఉత్తర కుమారుడు మరొకరు



 కొన్ని ఓట్లు, కాసిన్ని సీట్లే పరమావధిగా హస్తిన పెద్దల పుర్రెలో పురుడు పోసుకున్న పన్నాగంలో సీఎంగా కిరణ్, విపక్ష నేతగా చంద్రబాబు పాత్రధారులుగా మారారు.పుట్టిన గడ్డకే ద్రోహం చేసిన పరమ కిరాతకులుగా, తమ ప్రాంత ప్రయోజనాలు అస్సలు పట్టని పచ్చి స్వార్థపరులుగా చరిత్రలో మిగిలిపోయారు. అలాంటి సమయంలో... ఒకే ఒక్కడు. సీమాంధ్రకు నేనున్నానంటూ ముందుకొచ్చాడు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. విలువలకు నిలువెత్తు రూపమతడు. విశ్వసనీయతకు చెరగని చిరునామా అతడు. ఆ ఒకే ఒక్కడు... మహానేత వారసుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికార ప్రతిపక్షాలు ఒక్కటై సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగాడు. కుట్రలు చేసి తనను కటకటాల పాలు చేసినా అక్కడి నుంచే పిడికిళ్లు బిగించాడు. అన్నపానీయాలు మాని ఆమరణ దీక్షకు దిగాడు. హస్తిన చేస్తున్న అన్యాయంపై గళమెత్తాడు. సీమాంధ్ర అంతటా కలియదిరిగి సమైక్య శంఖారావం పూరించాడు. జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసి ఢిల్లీ పాలకులను నిలదీశాడు.



అడ్డగోలు విభజనను అడ్డుకోవాల్సిందిగా కోరి దేశమంతటినీ కదిలించాడు. దేవెగౌడ మొదలుకుని శరద్ యాదవ్ దాకా ముఖ్యమైన జాతీయ స్థాయి నేతలందరి గడపా తొక్కాడు. సమైక్యానికి వారందరి మద్దతూ కూడగట్టాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశాడు. స్వయంగా వెళ్లి వినతిపత్రాలు సమర్పించాడు. విభజనతో వినాశనమేనని సోదాహరణంగా వివరించాడు. విభజన బిల్లును అనుమతించొద్దంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశాడు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచండంటూ గవర్నర్‌ను కలిసి కోరా డు. అడ్డగోలు విభజనను నిరసిస్తూ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. పదవులను  వదులుకుని సమైక్యోద్యమంలోకి దూకారు. ఆయన మాతృమూర్తి వైఎస్ విజ యమ్మ సమైక్యం కోసం నిరాహార దీక్ష చేశారు. సీమాంధ్ర అంతటా పర్యటించారు. జగన్ సోదరి షర్మిల సీమాంధ్ర అంతటా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల ఆందోళనతో గొంతు కలిపారు. వారి గొం తుకై నిలిచారు. జగన్ స్వయంగా లోక్‌సభలోనూ సమైక్యనాదం చేశారు. సీమాంధ్ర గుండెచప్పుడును చట్టసభల్లో ప్రతిధ్వనింపజేశారు. సమైక్యాంధ్ర చాంపియన్‌గా, సీమాంధ్రకు ఏకైక ఆశాజ్యోతిగా నిలిచారు. వైఎస్ వారసుని రాక కోసం సీమాంధ్ర ప్రజ కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోందిప్పుడు..

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top