అవినీతిపరులు, నేరస్థుల కోసం సెటైరిస్ట్, కమెడియన్ దివంగత జస్పాల్ భట్టీ భార్య సవిత నోటా అనే పేరుతో పార్టీ స్థాపించారు. పోటీ చేయడానికి వాళ్లయితే సులువుగా దొరుకుతారనేది ఆవిడ ఉద్దేశం.
చండీగఢ్: అవినీతిపరులు, నేరస్థుల కోసం సెటైరిస్ట్, కమెడియన్ దివంగత జస్పాల్ భట్టీ భార్య సవిత నోటా అనే పేరుతో పార్టీ స్థాపించారు. పోటీ చేయడానికి వాళ్లయితే సులువుగా దొరుకుతారనేది ఆవిడ ఉద్దేశం. అయితే తన పార్టీలో సభ్యత్వం పొందాలంటే రూ. 200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి ఉండాలని, కనీసం 25 క్రిమినల్ కేసులైనా ఎదుర్కొంటూ ఉండాలని సవిత షరతులు పెట్టారు.
పనిలో పనిగా పక్కపార్టీల్లోని కళంకిత నేతలనందర్నీ ఆహ్వానించారు. నీతిపరులను, అవినీతిపరులను విభజించి పాలించడమే తన పార్టీ విధానమని ఆమె ప్రకటించారు. ఇంత బహిరంగంగా ఇలాంటివి ప్రకటిస్తే ఎవరు చేరతారు, అసలు ఓట్లు పడతాయా అని అనుకుంటున్నారా. ఇది ఉత్తుత్తి పార్టీ మాత్రమే. ఇక్కడి కమర్షియల్ సెక్టార్ 17 ప్లాజాలో ఆమె నోటా పార్టీ పేరుతో ఒక వ్యంగ్య నాటిక (స్పూఫ్)ను మంగళవారం ప్రదర్శించారు.