‘టైమ్ జాబితా’లో మోడీ, కేజ్రీవాల్ | 'Time' list in the Modi, Kejriwal | Sakshi
Sakshi News home page

‘టైమ్ జాబితా’లో మోడీ, కేజ్రీవాల్

Apr 25 2014 2:32 AM | Updated on Mar 29 2019 9:24 PM

‘టైమ్ జాబితా’లో మోడీ, కేజ్రీవాల్ - Sakshi

‘టైమ్ జాబితా’లో మోడీ, కేజ్రీవాల్

ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది.

జాబితాలో వీరు సహా నలుగురు భారతీయులు

 న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా గురువారం ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు.

మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మోడీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఏలనున్న విభజనవాద రాజకీయ నేత అని టైమ్ పేర్కొంది. కేజ్రీవాల్ ఆధునిక భారత రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని పేర్కొంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement