సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో రూ. 4.94 లక్షలు, వైరాలో రూ.5 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి. వివరాలు.. వైరా టీడీపీ అధ్యక్షుడు మేదరమెట్ల శ్రీనివాస్ మరికొందరు కార్యకర్తలతో కలిసి గాంధీనగర్‌లో డబ్బు పంచుతున్నారనే సమాచారం మేరకు ఎస్సై విక్రమ్ దాడి చేశారు.
వారినుంచి రూ.5 లక్షలు, ఓటర్ స్లిప్‌లు, ఓటరు జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతున్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే, ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, క్రాంతికుమార్ ఓటర్లుకు డబ్బులు పంపిణీ చేస్తుండగా వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.4.94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.