తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి విజయలక్ష్మి నివాసంలో ఎన్నికల అధికారుల తనిఖీలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి విజయలక్ష్మి నివాసంలో ఎన్నికల అధికారుల తనిఖీలు చేశారు. ఇంట్లో డబ్బులు దాచారంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ఫిర్యాదు చేయడంతో సోమవారం అర్థరాత్రి నుంచి విజయలక్ష్మి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.
అయితే, వాళ్లు అనుమానించినట్లుగా అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఓటమి భయంతో ఓటర్లకు డబ్బులు, మద్యం విపరీతంగా పంచుతున్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడంపై విజయలక్ష్మి, స్థానికులు మండిపడ్డారు.