కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం | social welfare possible only with congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం

May 10 2014 3:19 AM | Updated on Mar 18 2019 7:55 PM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తథ్యమని ఆ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు.

 తిరుమలగిరి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తథ్యమని ఆ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్మారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సంకెపల్లి పద్మనాభరెడ్డి, ఎస్.రఘునందన్‌రెడ్డి, మల్లయ్య, నరోత్తమ్‌రెడ్డి, సుజన్, సతీశ్‌రెడ్డి, కె.సతీశ, రవీందర్, రామ్మూర్తిగౌడ్, సల్ల వెంకన్న, ఉప్పలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, షకీల్, నాని పాల్గొన్నారు.
 
 తడిసిన ధాన్యం పరిశీలించిన దయాకర్
 మోత్కూరు : అకాలవర్షంతో మోత్కూరు మార్కెట్‌లో తడిసిన ధాన్యం రాశులను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట నాయకులు పైళ్ల సోమిరెడ్డి, బుం గపట్ల యాకయ్య, బయ్యని పిచ్చయ్య,  గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వంగాల సత్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, చింతల ఉపేందర్‌రెడ్డి, ఎండీ సమీర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement