ఎమోషన్లో నిర్ణయం తీసుకోలేదు: నితీష్ | My decision is not taken in a wave of emotions, says Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఎమోషన్లో నిర్ణయం తీసుకోలేదు: నితీష్

Published Mon, May 19 2014 5:01 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

ఎమోషన్లో నిర్ణయం తీసుకోలేదు: నితీష్ - Sakshi

ఎమోషన్లో నిర్ణయం తీసుకోలేదు: నితీష్

తన రాజీనామా నిర్ణయం ఉద్వేగంతో తీసుకున్నది కాదని జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ తెలిపారు.

పాట్నా: తన రాజీనామా నిర్ణయం ఉద్వేగంతో తీసుకున్నది కాదని జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ తెలిపారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను జేడీ(యూ) సంకీర్ణ ప్రభుత్వంలోని మిగతా పార్టీలకు వివరించానని చెప్పారు. తన నిర్ణయాన్ని అందరు మెచ్చుకున్నారని వివరించారు.

విధిలేని పరిస్థితులే తనను రాజీనామావైపు పురికొల్పాయని నితీష్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా వెనక్కు తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement