ముఖేష్ గౌడ్కు అనుమానమేల? | mukesh goud doubts of his candidature? | Sakshi
Sakshi News home page

ముఖేష్ గౌడ్కు అనుమానమేల?

Apr 5 2014 1:25 PM | Updated on Oct 17 2018 6:27 PM

ముఖేష్ గౌడ్కు అనుమానమేల? - Sakshi

ముఖేష్ గౌడ్కు అనుమానమేల?

మాజీ మంత్రి, హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఎన్నాళ్లనుంచో ఆరితేరిన యోధుడు ముఖేష్గౌడ్కు ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం వచ్చినట్లుంది.

మాజీ మంత్రి, హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఎన్నాళ్లనుంచో ఆరితేరిన యోధుడు ముఖేష్గౌడ్కు ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం వచ్చినట్లుంది. శుక్రవారం నాడు మంచిరోజని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ముఖేష్.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి నామినేషన్లు దాఖలు చేశారు. ఇది అందరినీ అనుమానంలో పడేసింది. వాస్తవానికి ఈసారి ముఖేష్.. తన కుమారుడు వికాస్ గౌడ్ను కూడా రాజకీయాల్లోకి దించాలనుకున్నారు. దాంతో ముఖేష్ పార్లమెంటుకు వెళ్లి, తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దింపుతారనే కథనాలు కూడా ఇంతకుముందు వచ్చాయి.

అయితే ఇటీవలి కాలంలో ఒక కుటుంబానికి ఒకటే పదవి అనే నినాదాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం వెలుగులోకి తెచ్చింది. దాంతో సీనియర్ నాయకుల ఆశలన్నీ అడియాసలుగా మారిపోయాయి. అందుకే ముఖేష్ గౌడ్ నేరుగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధపడ్డారని సమాచారం. అంతవరకు బాగానే ఉన్నా, ఆయన ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా, మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు దాఖలుచేయడంపైనే అనుమానాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ వస్తుందో లేదోనన్న అనుమానం ఏమైనా ముఖేష్కు ఉందా అని పలువురు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement