మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ | Loksatta supports to Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ

Apr 23 2014 2:35 AM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ - Sakshi

మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చెప్పారు.

హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో మోడీని కలసి కాసేపు మంతనాలు జరిపారు. అనంతరం జేపీ మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని నరేంద్రమోడీ మంచి మార్గంలో నడిపిస్తారని భావించి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. లోక్‌సత్తా పార్టీ కోరుకున్న నాలుగు అంశాలు.. ఆర్థికాభివృద్ధి, ఏడాదికి కోటి ఉద్యోగాలు,  సుపరిపాలన, ఇండియా నంబర్-1 వంటివి మోడీలో ఉన్నాయన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం విషయుంలో పవన్ కల్యాణ్ తనకు బహిరంగ మద్దతు తెలపడమే కాకుండా తర్వలో ప్రచారం చేయనున్నారని తెలిపారు.
 
ఆందోళనలో టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి..

 వుల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న లోక్‌సత్తా అభ్యర్థి జయుప్రకాష్ నారాయుణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసి వుద్దతు కోరడంతో ఇక్కడి టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి పరిస్థితి అగవ్యుగోచరంగా వూరింది. మిత్రపక్షమైన బీజేపీ తనకు కాకుండా జేపీకి వుద్దతిస్తుందేమోనని ఆయన వుథనపడుతున్నారు. చంద్రబాబు కూడా ఒకవైపు తన  సావూజికవర్గానికి చెందిన జేపీ కోసం, వురోవైపు మోడీ, పవన్‌లను ప్రసన్నం చేసుకునేందుకు తనను బలిచేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement