బీజేపీకి మద్దతుగా కర్ణాటకలో పవన్ ప్రచారం | JSP chief pawan Kalyan to canvass for BJP in Karnataka | Sakshi
Sakshi News home page

బీజేపీకి మద్దతుగా కర్ణాటకలో పవన్ ప్రచారం

Apr 15 2014 2:20 AM | Updated on Mar 22 2019 5:33 PM

బీజేపీకి మద్దతుగా కర్ణాటకలో పవన్ ప్రచారం - Sakshi

బీజేపీకి మద్దతుగా కర్ణాటకలో పవన్ ప్రచారం

బీజేపీకీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్: బీజేపీకీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్న రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9 నుంచి 11 గం టల మధ్య.. కోలార్ లోక్‌సభ పరిధిలో 12.30 నుంచి 2 మధ్య .. గుల్బర్గా నియోజకవర్గంలో సాయంత్రం జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.
 
 బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయడానికి కారణాలు వివరిస్తూ జనసేన కార్యాలయం పేరుతో సోమవారం మీడియాకు ప్రకటన విడుదలైంది. ‘సోమవారం ఢిల్లీ నుంచి మోడీ ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, సీమాంధ్ర బీజేపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పార్టీ కార్యవర్గంతో భేటీ అయ్యారు. ప్రాంతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తామంటూ బీజేపీ నేతల నుంచి స్పష్టమైన హామీ అనంతరం పవన్ కల్యాణ్ బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయించింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement