'అధిష్టానం ఎంపిగా పోటీ చేయమంది' | I contest as MLA : Kanna Lakshminarayana | Sakshi
Sakshi News home page

'అధిష్టానం ఎంపిగా పోటీ చేయమంది'

Mar 26 2014 3:20 PM | Updated on Aug 24 2018 2:33 PM

కన్నా లక్ష్మీనారాయణ - Sakshi

కన్నా లక్ష్మీనారాయణ

పార్టీ మారడంపై వచ్చిన వార్తలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు.

గుంటూరు: పార్టీ మారడంపై వచ్చిన వార్తలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. అధిష్టానం తనని లోక్సభకు పోటీ చేయమని చెప్పారు. అయితే తాను శాసనసభకు పోటీ చేస్తానని చెప్పానని, అధిష్టానం అందుకు అంగీకరించిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని  కన్నా చెప్పారు.

 జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా జిల్లాలో ఆయన సీనియర్ మంత్రిగా కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ పదవికి, ఆ తరువాత సీమాంధ్ర పిసిసి అధ్యక్ష పదవికీ కన్నా పేరు ప్రముఖంగా వినవచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement