వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న మద్దతు | hundreds of people join ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న మద్దతు

Apr 23 2014 7:41 PM | Updated on Aug 14 2018 4:21 PM

వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న మద్దతు - Sakshi

వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న మద్దతు

ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

విశాఖపట్నం: ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వైఎస్సార్ సీపీలోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నారు. గాజువాక అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో 50వ వార్డు నుంచి 200 మంది మహిళలు పార్టీలో చేరారు. విజయమ్మకు మద్దతుగా కోలా గురువులు ఆధ్వర్యంలో విశాఖ నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ కన్వీనర్‌ నౌషథ్‌ ఆధ్వర్యంలో 200 మంది వైఎస్సార్ సీపీలో చేరారు.

కృష్ణా జిల్లా జి.కొండూరులో విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, మైలవరం అసెంబ్లీ అభ్యర్థి జోగి రమేష్ సమక్షంలో మాజీ జెడ్పీటీసీలు తేరేజమ్మ, దగ్గుమల్ల భారతి, మాజీ ఎంపీపీ పులిపాక తామస్, మాజీ డీసీసీ కార్యదర్శి పామర్తి శ్రీనివాసరావు సహా 200 మంది వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.

కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డికి మద్దతుగా కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా రమణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోలా రమణారెడ్డి సమక్షంలో 200 మంది వైఎఎస్సార్ సీపీలో చేరారు.    

అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరిలో వైపీ ప్రభాకర్‌రెడ్డి, వైసీ గోవర్థన్‌రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ శ్రీరాములు సహా 50 మంది వైఎస్సార్ సీపీలో చేరారు.

చిత్తూరు జిల్లా సదూంలో వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వి.కోట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వీవీ రత్నం పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement