గన్‌మెన్‌లు అప్రమత్తంగా ఉండాలి.. | Gunmens to be vigilant .. | Sakshi
Sakshi News home page

గన్‌మెన్‌లు అప్రమత్తంగా ఉండాలి..

Mar 23 2014 2:51 AM | Updated on Oct 16 2018 6:27 PM

గన్‌మెన్‌లు విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ఎప్పుడు అప్రమత ్తంగా ఉండాలని ఏఆర్ ఆర్‌ఐ శంకర్ పేర్కొన్నారు.

 రఘునాధపాలెం, న్యూస్‌లైన్: గన్‌మెన్‌లు విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ఎప్పుడు అప్రమత ్తంగా ఉండాలని ఏఆర్ ఆర్‌ఐ శంకర్ పేర్కొన్నారు. రఘునాధపాలెం మండ లం మంచుకొండలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో శనివారం గన్‌మెన్‌లకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. గన్‌మెన్‌లుగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఫిస్టల్, కార్బన్ వెపన్‌లతో ఫైరింగ్ సాధన చేయించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లంమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు, రాజకీయ నాయకులకు ఉండే గన్‌మెన్‌లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేసే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్సైలు నాగేశ్వరరావు, నర్సయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement