హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ | devishetti srinivas rao nomination rejected | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Apr 10 2014 3:28 PM | Updated on Mar 29 2019 9:24 PM

జిల్లాలోని హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాస్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది.

కరీంనగర్:హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాస్ రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ గడువు ముగిసిన తరువాత ఏ ఫారమ్ ను  ఆలస్యంగా సమర్పించడంతో ఎన్నికల అధికారులు దేవిశెట్టి నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నబీజేపీకి తొలి దెబ్బతగిలింది.  దీంతో ఇక ఈ స్థానంలో బీజేపీ పోటీకి దూరమైంది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి నేటితో తెరపడింది.

 

గత ఎనిమిది రోజుల్లో.. 13 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 370 మంది, రెండు పార్లమెంట్ స్థానాల్లో 44 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రామగుండం అసెంబ్లీ నానికి అత్యధికంగా 55 మంది, మంథనికి అతి తక్కువగా 16 మంది నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి 21 మంది, పెద్దపల్లి పార్లమెంట్‌కు 23 మంది నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో వివిధ పార్టీల అభ్యర్ధులు పోటాపోటీ ర్యాలీలు.. భారీ ఊరేగింపుల మధ్య అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు.

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి వి.సతీశ్‌కుమార్, జక్కు రాజు(ఎంసీపీఐ), కె.చంద్రశేఖర్(అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), బుర్ర శ్రీనివాస్(బీసీ యునెటైడ్ ఫ్రంట్), బొల్లం రవి(లోక్‌సత్తా), దుబ్బాక విష్ణువర్ధన్‌రెడ్డి, బొల్లి అయిలయ్య (బీఎస్పీ) నామినేషన్లు దాఖ లు చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement