తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి | Candidates selection complete : Digvijay Singh | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి

Mar 23 2014 4:45 PM | Updated on Mar 9 2019 3:26 PM

దిగ్విజయ్ సింగ్ - Sakshi

దిగ్విజయ్ సింగ్

తెలంగాణలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది.

ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే  అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జరిగిన   స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ  తెలంగాణకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు చెప్పారు. 10 నుంచి 15 సీట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు.  పెండింగ్ సీట్లు ఖరారు చేసేందుకు మరింత హోంవర్క్ చేయవలసి ఉందని చెప్పారు.

టిఆర్ఎస్తో  పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు.  మరో రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు.  సీమాంధ్రలో పార్టీ చేపట్టిన బస్సుయాత్ర ముగియగానే అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.  ఈ నెల 28న అభ్యర్థుల మొదటి జాబితాను హైదరాబాద్ లో  విడుదల చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement