దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం? | Sakshi
Sakshi News home page

దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?

Published Tue, Apr 15 2014 10:27 PM

దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం? - Sakshi

1.    వాతావరణ స్థితి  అంటే ఏమిటి?
వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలైన ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, ఆర్ధ్రత లాంటి ఏదైనా ఒక ప్రాంతం అంశాల స్థితిని కొన్ని గంటలకు  లేదా ఒక రోజుకు  పరిగణనలోకి తీసుకున్నట్లయితే దాన్ని ఆ ప్రాంతం ‘వాతావరణ స్థితి’ అని అంటారు. ఒక ప్రాంత వాతావరణ స్థితి అస్థిరమైంది.

 2.    శీతోష్ణస్థితి అంటే ఏమిటి?
     ఏదైనా ఒక ప్రాంతం  వాతావరణ స్థితి సగటును దీర్ఘకాలికంగా అంటే 30 లేదా 50 లేదా 100 ఏళ్లకు లెక్కించినట్లయితే వచ్చే విలువను ఆ ప్రాంత శీతోష్ణస్థితిగా పరిగణిస్తారు. ఏదైనా ఒక ప్రాంతం శీతోష్ణస్థితి దాదాపు స్థిరంగా ఉంటుంది.

 3.    భూ వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది?
     నైట్రోజన్

 4.    భూ వాతావరణంలో అధికంగా  ఉన్న జడవాయువు ఏది?
     ఆర్గాన్

 5.    భూ వాతావరణంలో లేని వాయు మూలకం ఏది?
     క్లోరిన్

 6.   ప్రస్తుతం ఉన్న స్థితిలో భూ వాతావరణం ఎంత కాలం క్రితం ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు?
     580 మిలియన్ సంవత్సరాలు

 7.    వాతావరణంలోని ఏ పొరలో సంవహన ప్రక్రియ అధికంగా జరుగుతుంది?
     {sZ´ో ఆవరణం

 8.    వాతావరణంలోని ఏ పొరలో ద్రవీభవనం, మేఘనిర్మాణం, ఉరుములు, మెరుపులు, వర్షపాతం, మంచు, అల్పపీడనాలు లాంటివి   ఏర్పడతాయి?
     {sZ´ో ఆవరణం

 9.    ‘జెట్‌స్ట్రీమ్స్’ వాతావరణంలోని ఏ ప్రాంతంలో కదులుతాయి?
     {sZ´ో ఆవరణం పై సరిహద్దు

 10.    {sZ´ో ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ‘ఉష్ణోగ్రత క్షీణత రేటు’ ఏ విధంగా ఉంటుంది?
   ప్రతి 165 మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ 1నిఇ చొప్పున తగ్గుతుంది.

 11.    జెట్ విమానాలు వాతావరణంలోని ఏ ప్రాంతంలో ప్రయాణిస్తాయి?
 స్టాటో ఆవరణం

 12.    భూమిపై ఉండే జీవరాశిని సూర్యుని అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షించే ‘ఓజోన్ పొర’ వాతావరణంలోని ఏ భాగంలో ఉంది?
స్టాటో ఆవరణం

 13.    సాధారణ ఉష్ణోగ్రత క్షీణతాక్రమం అంటే ఏమిటి?
     సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియ.

 14.    సాధారణ ఉష్ణోగ్రతా క్షీణత క్రమం వాతావరణంలోని ఏ  ప్రాంతాల్లో కన్పిస్తుంది?
     {sZ-´ో, మీసో ఆవరణాల్లో

 15.    ఉష్ణోగ్రత విలోమం (ఐఠ్ఛిటటజీౌ ఖ్ఛీఝఞ్ఛట్చ్టఠట్ఛ) అంటే ఏమిటి?
     ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండే ప్రక్రియ.

 16.    భూ వాతావరణంలో ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ ఏ ప్రాంతంలో కన్పిస్తుంది?
     థర్మో, ఎక్సో ఆవరణాలు

 17.    రేడియో తరంగాలు వాతావరణంలోని ఏ ప్రాంతం నుంచి భూమివైపు  పరావర్తనం చెందుతాయి?
     థర్మో(ఐసో) ఆవరణం

 18.‘ఉల్కలు’ అనే ఖగోళ పదార్థాలు వాతావరణంలోని ఏ ప్రాంతంలో మండుతాయి?
     మీసో ఆవరణం

 19.    బాహ్య ట్రోపో ఆవరణం అని దేన్ని పిలుస్తారు? దీనికి కారణం ఏమిటి?
     మీసో ఆవరణం.  ట్రోపో ఆవరణంలో మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

 20.    భూ వాతావరణంలో ఏ ప్రాంతంలో స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఉంటాయి?
     ఐనో/థర్మో ఆవరణం

 21.    విరుద్ధ ఆవరణం (ఏ్ఛ్ట్ఛటౌటఞజ్ఛిట్ఛ) అని దేన్ని పిలుస్తారు? ఎందుకు?
     భూ ఉపరితలం నుంచి 80 కి.మీ.ల పైన ఉండే థర్మో, ఎక్సో ఆవరణాలను కలిపి విరుద్ధ ఆవరణం అని పిలుస్తారు. ఈ రెండు ఆవరణాల్లో వాతావరణ సంఘటనం స్థిరంగా ఉండక మార్పులతో కూడి ఉంటుంది.
 
 ఉష్ణోగ్రత
 22.    వాతావరణంలోని వేడి తీవ్రతను ఏమంటారు?
     వాతావరణ ఉష్ణోగ్రత

 23.    సౌర వికిరణం అంటే ఏమిటి?
     భూమి గ్రహించే సౌరశక్తి పరిమాణాన్ని లేదా భూమిని చేరే సౌరశక్తి పరిమాణాన్ని సౌర వికిరణం అని పిలుస్తారు.

 24.    భౌమ వికిరణం అంటే ఏమిటి?
     భూ ఉపరితలం దీర్ఘతరంగాల రూపంలో వాతావరణంలోకి కోల్పోయే ఉష్ణశక్తిని భౌమ వికిరణం అని పిలుస్తారు.

25.    భూమి సగటు సౌర స్థిరాంకం (ౌ్చట ఇౌట్ట్చ్ట) విలువ ఎంత?
     1.94 గ్రాము కేలరీలు / చ.సెం.మీ./ నిమిషం

26. ధువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండటానికి కారణం?
     భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు లంబంగా, ధ్రువాల వద్ద ఏటవాలుగా పడతాయి. దీని కారణంగా లంబ కిరణాలు తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ వేడిని కలిగిస్తాయి. అదే విధంగా ఏటవాలు కిరణాలు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువ వేడిని కలిగిస్తాయి.

 27.    ఒక రోజులో భూమి గ్రహించే సరాసరి సూర్యపుటాన్ని ఏమని పిలుస్తారు?
     సౌర దినం

 28.    భూ ఉపరితలం నుంచి పైకి పోయేకొద్దీ ఉష్ణోగ్రత క్షీణించడానికి కారణం?
     భూ వాతావరణం వేడెక్కడం  భూ ఉపరి తలాన్ని ఆనుకొని ఉన్న అడుగు పొర నుంచి ప్రారంభమవుతుంది.

 29.    భూ వాతావరణం అడుగు పొర నుంచి వేడెక్కడానికి కారణం?
     భూ వాతావరణం పగటి సమయంలో సూర్యుని నుంచి వెలువడే హ్రస్వ తరంగాల ద్వారా కాకుండా సాయంత్రం వేళ భూమి నుంచి దీర్ఘ తరంగాల రూపంలో వెలువడే భౌమ వికిరణం ద్వారా వేడెక్కుతుంది. అందువల్ల సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

 30.    భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత ఎంత?
     15నిఇ

 31.    అమృత్‌సర్, సిమ్లా ఒకే అక్షాంశం మీద ఉన్నప్పటికీ అమృత్‌సర్ కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం?
     అమృత్‌సర్‌తో పోలిస్తే సిమ్లా సముద్రమట్టం కంటే అధిక ఎత్తులో ఉంటుంది.

 32.    ఉష్ణోగ్రతా విలోమం అధికంగా ఏ ప్రాంతాల్లో సంభవిస్తుంది?

     ఖండాంతర్గత పర్వత లోయలు (ఐ్ట్ఛటఝ్ట్చౌ్ఛ గ్చ్ఛడట); పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు; ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే తీర ప్రాంతాలు.

 33.    ఖండాంతర్గత పర్వత లోయల్లో నివసించే ప్రజలు నివాసాలను,  పంట పొలాలను ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటారు?
     పర్వత వాలుల్లో

 34.    కాఫీ, తేయాకు లాంటి పంటలను ఉత్తరార్ధ గోళంలో భూ భాగాల/పర్వతాల దక్షిణ వాలుల్లో, దక్షిణార్ధ గోళంలో ఉత్తర వాలుల్లో మాత్రమే సాగు చేయడానికి కారణం ఏమిటి?
     అవి సూర్యుడికి ఎదురుగా ఉన్నందు వల్ల అక్కడ సాపేక్షంగా ఎక్కువ సూర్యపుటం చేరి పొగమంచు ఏర్పడకుండా నివారి స్తుంది. పొగమంచు  పంటల పెరుగుదలకు, దిగుబడులకు హానికరం.

 35.    ఉత్తరార్ధ గోళంలో  అధిక,   అల్ప ఉష్ణోగ్రతలు  ఏయే నెలల్లో నమోదవుతాయి?
     జూలై, జనవరి

 36.    వాతావరణ చిత్రపటంపై ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?
     ఐసోథర్‌‌మ్స(సమోష ్ణరేఖలు)

 37.    ఇప్పటివరకు భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు  నమోదైన ప్రాంతం ఏది?
     సహారా ఎడారిలోని లిబియా దేశంలో ఉన్న ‘అల్ అజీజియా’ (58నిఇ).

 38.    భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది?
     రాజస్థాన్‌లోని జైసల్మీర్ (56.5నిఇ)

 39.    ఉత్తరార్ధ గోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం?
     సైబీరియాలోని వెర్కోయాన్ష్కి

 40.    ‘శీతల ధ్రువం’ అని దేన్ని పిలుస్తారు?
     వెర్కోయాన్ష్కి

 41.    భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం?
     అంటార్కిటికా ఖండంలోని ఓస్టాక్

 42.    ఆల్బిడో అంటే ఏమిటి?
     భూ వాతావరణం నుంచి పరావర్తనం చెందే సౌరవికిరణాన్నే ఆల్బిడో అంటారు.

 43.    భూమి సగటు ఆల్బిడో ఎంత?
     35%

 44.    భూమిపై అత్యధిక ఆల్బిడో పరిమాణం  ఉన్న  ప్రాంతాలు ఏవి?
     మంచు ప్రాంతాలు     
 
 వాతావరణ పీడనం
 45.    వాతావరణ పీడనం అంటే ఏమిటి?
  ప్రమాణ వైశాల్యం  ఉన్న భూభాగంపై, దానిపై ఉన్న వాతావరణం ఒత్తిడి రూపంలో కలిగించే బలాన్నే వాతావరణ పీడనం అని పిలుస్తారు.

 46.    వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
     భారమితి(బారోమీటరు). దీన్ని టారిసెల్లీ అనే ఇటలీ శాస్త్రజ్ఞుడు రూపొందించాడు.

 47.    ఆధునిక పద్ధతుల్లో పీడనాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
     మిల్లీబార్ (ఒక చ.సెం.మీ.పై ఒక గ్రాము ఒత్తిడిని (1జఝ/ఛిఝ2) మిల్లీబార్ అని పిలుస్తారు.

 48.    భారమితిలో పాదరసమట్టం ఆకస్మికంగా తగ్గిపోవడం దేన్ని సూచిస్తుంది?
     వర్షం రాకను(వాతావరణ అలజడులు)

 49.    భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్దీ  పీడనం తగ్గడానికి కారణం?
     పైకి వెళ్లేకొద్దీ వాతావరణ సాంద్రత తగ్గిపోవడం

 50.    భారమితిలో పాదరసమట్టం పెరగడం దేన్ని సూచిస్తుంది?

  ప్రశాంత వాతావరణం
 51.    సముద్రమట్టం వద్ద సగటు వాతావరణ పీడనం ఎంత?
     1013.25 మిల్లీబార్‌‌స

 52.    సముద్రమట్టం నుంచి పైకి వెళ్లేకొద్దీ పీడనం ఏ రేటులో తగ్గుతుంది?
 ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున తగ్గుతుంది.

 53.    వాతావరణ పటంపై ఒకే పీడనం  ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన  ఊహారేఖలను ఏమని పిలుస్తారు?
     ఐసోబార్‌‌స (సమభార రేఖలు)

 54.    ‘డోల్‌డ్రమ్స్’ అని దేన్ని పిలుస్తారు?
     భూమధ్యరేఖ అల్పపీడన మేఖల

 55.    ‘అశ్వ అక్షాంశాలు’ అని వేటిని పిలుస్తారు?
     ఉపఆయనరేఖ ప్రాంత అక్షాంశాలు (25 నుంచి 35 మధ్య ఉన్న అక్షాంశాలు)

 56.  ప్రపంచంలో ఇప్పటివరకు అధిక వాతావరణ పీడనం నమోదైన ప్రదేశం?
     సైబీరియాలోని అగాటా

 57.    ప్రపంచంలో ఇప్పటివరకు అతి తక్కువ వాతావరణ పీడనం నమోదైన ప్రదేశం?
     ఫిలిప్పైన్ దీవుల సమీపంలోని టైఫూన్ టిప్ పవనాలు

 58.    పవనాలు వీయడానికి ప్రధాన కారణం?
     రెండు ప్రదేశాల మధ్య ఉన్న పీడన  వ్యత్యాసం.

 59.    పవన వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాలు?
     ఎనిమోమీటరు, భీఫోర్‌‌డ స్కేలు

 60.    పవనదిశను గుర్తించడానికి ఉపయోగించే పరికరం?
     పవన సూచి (గిజీఛీ ఠ్చ్ఛి)

 61.    పవన వేగాన్ని, దిశను ప్రభావితం చేసే అంశాలు?
     పీడన ప్రవణత బలాలు, కోరియాలిస్ బలాలు, భూమి ఘర్షణ బలాలు.

 62.   ప్రపంచ పవనాలు అని వేటిని పిలుస్తారు? అవి ఏవి?
     అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు స్థిరంగా, నిర్ణీత దిశలో  ఏడాది పొడవునా వీచే పవనాలు. అవి..
     1) వ్యాపార పవనాలు
     2) పశ్చిమ పవనాలు
     3) ధ్రువ లేదా తూర్పు పవనాలు

 63.    ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు ఏ వైపునకు వంగి వీస్తాయి?
     కుడివైపునకు

 64.    దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఏ వైపునకు వంగి వీస్తాయి?
     ఎడమవైపునకు

 65.    ఉత్తరార్ధ గోళంలో వ్యాపార పవనాలు ఎటు నుంచి ఎటువైపు వీస్తాయి?
     ఈశాన్య దిశ నుంచి నైరుతి దిశ వైపు

 66.    దక్షిణార్ధ గోళంలో వ్యాపార పవనాలు ఎటు నుంచి ఎటు వైపు వీస్తాయి?
          ఆగ్నేయ దిశ నుంచి వాయువ్యం వైపు

 67.    ప్రపంచంలోని ఉష్ణమండల ఎడారులన్నీ 15ని నుంచి 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ ప్రాంతాల్లో మాత్ర మే    ఏర్పడి  ఉన్నాయి. దీనికి కారణం?
     వ్యాపార పవనాలు ఖండాల తూర్పు ప్రాంతాల్లో ప్రవేశించినప్పుడు తడిగా ఉండి వర్షాన్నిస్తాయి. కానీ, అవి పశ్చిమ ప్రాంతాలను చేరే    సమయానికి పొడిగా మారి వర్షాన్ని ఇవ్వలేకపోవడం.

Advertisement
 
Advertisement
 
Advertisement