యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో యువభవన్ నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
కర్నూలులో యువభవన్
Nov 9 2016 12:30 AM | Updated on Sep 4 2017 7:33 PM
- రూ.2కోట్లతో సిల్వర్‌జూబ్లీ కళాశాల వద్ద ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో యువభవన్ నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బి.క్యాంపులోని సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో కొంత భాగాన్ని ఇటీవలే ఆ శాఖ స్పెషల్ కమిషనర్ కోమల్ కిశోర్ పరిశీలించారు. మైదానానికి ముందు భాగంలో రెండెకరాల స్థలంలో రూ.2కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నారు. యువభవన్‌లో కంప్యూటర్ ల్యాబ్, యోగా, జిమ్ సెంటర్లు, డార్మెటరి, కాన్ఫరెన్స్ హాలు, కెరీర్ కౌన్సెలింగ్, పర్సనాలిటి డెవలప్‌మెంట్ ట్రైనింగ్, ఈడీపీ ట్రైనింగ్, హెల్త్ క్యాంపులు, క్రీడలు, ఆర్ట్స్ అండ్ కల్చర్ తదితర అంశాలను యువతకు వివరించనున్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు.
Advertisement
Advertisement