breaking news
silver jublee college
-
ముగిసిన యువమహోత్సవ్
–విజేతలకు బహుమతుల ప్రదానం కర్నూలు(హాస్పిటల్): స్థానిక సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) ఆధ్వర్యంలో మూడురోజులుగా కొనసాగుతున్న యువ మహోత్సవం ఆదివారం సాయంత్రం ముగిసింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఏర్పాటు కాబోతున్న యువభవన్లో యువతకు అవసరమైన లైబ్రరీ, ఆడిటోరియం, డార్మెటరి, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలన్నీ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. సెట్కూరు సీఈవో మస్తాన్‌వలీ మాట్లాడుతూ యువభవన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లను మంజూరు చేసిందని, అందులో ఇప్పటికే రూ.2కోట్ల నిధులు విడుదల అయ్యాయన్నారు. స్థానిక సిల్వర్‌జూబ్లీ కళాశాలలో నెలరోజుల్లో ఈ భవనానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీనివాసులు మాట్లాడుతూ యువమహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సేవాకార్యక్రమాలు నిర్వహించిన యువతను గుర్తించడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన 30 మంది రక్తదాతలకు జ్ఞాపికలు, బహుమతులు ప్రదానం చేశారు. ఉదయం జరిగిన సైకిల్ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాల్గొన్నారు. యువత సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, సిల్వర్‌జూబ్లీ ప్రిన్సిపల్ అబ్దుల్‌కాదర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడోరోజు విజేతలు వీరే... సోలో–1. కెఎ. గ్రీష్మ, వాసవి డిగ్రీ కళాశాల, 2. డి. యాసిన్భాను, సెయింట్‌జోసఫ్ డిగ్రీ కళాశాల, 3. జయశ్రీ, సిల్వర్‌జూబ్లీ కళాశాల సోలో గ్రూప్స్‌లో–1. వందన గ్రూప్, శ్రీ చక్ర డిగ్రీ కళాశాల, 2. ప్రియా గ్రూప్, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. ఎన్. తిరుమలేష్ గ్రూప్, శ్రీ చక్ర డిగ్రీ కళాశాల మ్యూజిక్ గ్రూప్–1. శ్రావణి గ్రూప్, శ్రీశంకరాస్ డిగ్రీ కళాశాల, 2. శశికళ గ్రూప్, కేవీఆర్ డిగ్రీ కళాశాల, 3. మల్లికార్జున గ్రూప్, సెయింట్ జోసఫ్ కాలేజి సోలో–1. ఉషారాణి, కేవీఆర్ మహిళా కళాశాల, 2, 3, వందన, మల్లికార్జున, సెయింట్ జోసఫ్ కాలేజి 5కె సైకిల్ రేస్(బాలికలు)–1. వెంకటలక్ష్మి, కేవీఆర్ కళాశాల, 2,3. మౌనిక, వందన, సెయింట్ జోసఫ్ కళాశాల 5కె సైకిల్ రేసు(పురుషులు)–1. జి. మహేష్, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 2. ఎం. కేశవస్వామి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు), 3. ఎం. రవి, సిల్వర్‌జూబ్లీ కళాశాల లెమన్ అండ్ స్పూన్–1.పి. మమత, కేవీఆర్ మహిళా కళాశాల, 2. ఎల్. అనిత, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. కె. ప్రియాంక, వాసవి డిగ్రీ కళాశాల బాడ్మింటన్(బాలికలు)–1. ఎం. యమున, సిల్వర్‌జూబ్లీ కళాశాల, అనూష, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 2. అనిత, ప్రమీల, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. భాగవతి, మనీషా, సిల్వర్‌జూబ్లీ కళాశాల -
పరిశోధనారంగంలో విస్తృత అవకాశాలు
కర్నూలు సిటీ: శాస్త్రీయ పరిశోధన రంగం వైపు యువత రావాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలో విస్త్రృతమై అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రొఫెసర్లు అన్నారు. క్యాన్సర్ బయాలజీ అనే అంశంపై స్థానిక సిల్వర్‌జూబ్లీ కాలేజీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ శనివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ డా.హరీష్, అన్నామలై యూనివర్శిటీ ప్రొఫెసర్ నాగిని, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ రాజేశ్వరిలు ముఖ్య అతి«ధులుగా హాజరై ప్రసంగించారు. దేశ భవిష్యత్తు, అబివృద్ధి అనేది శాస్త్ర పరిశోధన రంగంపై ఆధార పడి ఉంటుందన్నారు. రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనరంగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అధిక శాతం మంది యువత క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఆహారపు అలవాట్లు కాలానుగణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్‌పై దేశంలో పరిశోధనలు పెద్ద ఎత్తున చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆ కాలేజీ పూర్వ విద్యార్తి శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్డాక్టర్ అబ్దుల్ ఖాదర్, వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఆర్గనైజింగ్ కార్యదర్శి జాన్సన్ సాటురస్, కన్వీనర్ మైఖెల్ డేవిడ్, లలితా కూమారి, మాధవీలత, లక్ష్మీరంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో యువభవన్
- రూ.2కోట్లతో సిల్వర్‌జూబ్లీ కళాశాల వద్ద ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో యువభవన్ నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బి.క్యాంపులోని సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో కొంత భాగాన్ని ఇటీవలే ఆ శాఖ స్పెషల్ కమిషనర్ కోమల్ కిశోర్ పరిశీలించారు. మైదానానికి ముందు భాగంలో రెండెకరాల స్థలంలో రూ.2కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నారు. యువభవన్లో కంప్యూటర్ ల్యాబ్, యోగా, జిమ్ సెంటర్లు, డార్మెటరి, కాన్ఫరెన్స్ హాలు, కెరీర్ కౌన్సెలింగ్, పర్సనాలిటి డెవలప్మెంట్ ట్రైనింగ్, ఈడీపీ ట్రైనింగ్, హెల్త్ క్యాంపులు, క్రీడలు, ఆర్ట్స్ అండ్ కల్చర్ తదితర అంశాలను యువతకు వివరించనున్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు.