3న కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ మహాధర్నా | ysrcp strikes in anantapur on october 3rd | Sakshi
Sakshi News home page

3న కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ మహాధర్నా

Sep 24 2016 10:54 PM | Updated on Jul 25 2018 4:09 PM

జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలను కాపాడడంలోనూ, కరువు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబరు 3న కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలను కాపాడడంలోనూ, కరువు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబరు 3న కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ధర్నాకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 27న ధర్నా నిర్వహించాలని తొలుత భావించామని, అయితే.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరదలు సంభవించిన నేపథ్యంలో జగన్‌ అక్కడ పర్యటించబోతున్నారని తెలిపారు. దీంతో ధర్నాను వాయిదా వేశామని పేర్కొన్నారు. ప్రభుత్వతీరుతో మోసపోయిన రైతులు మహాధర్నాకు భారీఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement