మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు | youth attack with liquar effect | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు

Dec 12 2016 10:57 PM | Updated on Sep 4 2017 10:33 PM

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు

మహానాడు (తాడేపల్లి రూరల్‌) : తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో మద్యం మత్తులో నలుగురు యువకులు స్థానికులపై దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

  •   ముగ్గురిపై దాడి  
  •  
    మహానాడు (తాడేపల్లి రూరల్‌) : తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో మద్యం మత్తులో నలుగురు యువకులు స్థానికులపై దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... శ్రీనివాస్‌ అనే విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. గత రాత్రి తన ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తుండగా ఎదురుగా రెండు వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు ‘అన్న వస్తుంటే తప్పుకోవడం తెలియదా..’ అంటూ బండి దిగి దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేసినట్టు విద్యార్థి శ్రీనివాస్‌ తెలిపాడు. తర్వాత వారెవరని ఇంట్లోని పెద్దలు విచారిస్తే, కళ్యాణ్, కింటు, కిరణ్‌గా ముగ్గురిని గుర్తించారు. మరో యువకుడు ఎవరో తెలియదని శ్రీనివాస్‌ చెప్పాడు. ఘటనపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ నలుగురు యువకులే మద్యం మత్తులో ఓ వృద్ధుడిని, మరో యువకుడిని కూడా చితకబాదినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement