మిర్యాలగూడలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు | Youngster to climp cell tower in Miryalaguda | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Oct 4 2015 2:01 PM | Updated on Sep 3 2017 10:26 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక యువకుడు ఆదివారం మధ్యాహ్నం బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఎక్కాడు.

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక యువకుడు ఆదివారం మధ్యాహ్నం బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. దామచర్ల మండలం తిమ్మాపురం గ్రామం తూర్పు తాండాకు చెందిన రాము మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌సి క్యాంప్‌లో ఉన్న మణికంఠ హోటల్‌లో పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం హోటల్ యజమానితో పొసగక మానేశాడు. తనకు చెందిన స్టవ్‌ను తీసుకెళ్లాడు.

దాంతో ఆగ్రహించిన హోటల్ యజమాని లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదుచేసి స్టవ్ చోరీ చేశాడని కేసు పెట్టాడు. దాంతో పోలీసులు రామును పోలీస్‌సేస్టేషన్ తీసుకెళ్లి వాళ్ల రీతిలో ట్రీటేమెంట్ ఇచ్చారు. దాంతో ఆవేదనకు గురైన రాము హోటల్ యజమాని కేసు పెట్టడంవల్లే ఇదంతా అయిందని ఆదివారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ద్గమని నచ్చచెబుతున్నారు. అయినా తను ససేమిరా అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement