ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య | Young woman suicide | Sakshi
Sakshi News home page

ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య

Jun 7 2016 1:43 AM | Updated on Aug 1 2018 2:15 PM

ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో సోమవారం జరిగింది.

ఖానాపురం: ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై దుడ్డెల గురుస్వామి కథనం ప్రకారం... వరంగల్‌లోని దయానంద కాలనీకి చెందిన కోన్‌రెడ్డి అరుణ-వుల్లారెడ్డి దంపతుల కుమార్తె శ్రీవిద్య(28) వరంగల్‌లో పీజీ వరకు చదువుకుంది. కొంతకాలంగా శ్రీవిద్య ఫిట్స్‌తో, మానసిక స్థితి బాగలేక బాధపడుతోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అయిన అరుణ ఇంట్లో కిం దపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో అరుణ హన్మకొండలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొం దుతుండగా శ్రీవిద్య తల్లిని ఆస్పత్రిలో చూసి అశోక్‌నగర్‌లోని అమ్మమ్మ అయిన చల్లా శకుంతమ్మ-కొంరారెడ్డి ఇంటికి వచ్చింది. తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అవ్మువ్ము ఇంట్లోకి వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుస్వామి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement