యువకుడి బలవన్మరణం | young man suscide | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Aug 25 2016 11:24 PM | Updated on Aug 1 2018 2:29 PM

ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ గ్రామానికి చెందిన చిన్ని మహేందర్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజిరెడ్డి, రాజవ్వ దంపతుల కుమారుడు మహేందర్‌రెడ్డి గతేడాది బీటెక్‌ పూర్తిచేశాడు.

ముస్తాబాద్‌ : ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ గ్రామానికి చెందిన చిన్ని మహేందర్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజిరెడ్డి, రాజవ్వ దంపతుల కుమారుడు మహేందర్‌రెడ్డి గతేడాది బీటెక్‌ పూర్తిచేశాడు. కొన్ని నెలలుగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ బాచుపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. మహేందర్‌రెడ్డి తాత అనారోగ్యానికి గురికాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో బుధవారం శస్త్రచికిత్స చేయించారు. ఆసుపత్రిలో సాయంత్రం వరకు ఉన్న మహేందర్‌రెడ్డి రూమ్‌కు వెళ్లివస్తానని చెప్పి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వారి రోదనలు మిన్నంటాయి. 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement