breaking news
avunoor
-
ఎస్సై శ్రీధర్ అంత్యక్రియలు
ముస్తాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో పోలీస్ అధికారిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీధర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ప్రజల సందర్శనార్థం మృతదేహన్ని ఆయన ఇంటిలో ఉంచారు. కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, సిరిసిల్ల రూరల్ సీఐ శ్రీధర్, టౌన్ సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు ప్రవీణ్, ఉపేందర్, లక్ష్మారెడ్డి, ఎస్బీ ఎస్సై మారుతి, ప్రత్యేక పోలీస్ బృందం సెల్యూట్ చేశారు. మానేరు వాగులో ఆశ్రునయనాలతో శ్రీధర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. శ్రీధర్ తల్లిదండ్రులు స్వతంత్ర, ధర్మయ్యలను పోలీస్ అధికారులు ఓదార్చారు. -
యువకుడి బలవన్మరణం
ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన చిన్ని మహేందర్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజిరెడ్డి, రాజవ్వ దంపతుల కుమారుడు మహేందర్‌రెడ్డి గతేడాది బీటెక్ పూర్తిచేశాడు. కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ బాచుపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. మహేందర్‌రెడ్డి తాత అనారోగ్యానికి గురికాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో బుధవారం శస్త్రచికిత్స చేయించారు. ఆసుపత్రిలో సాయంత్రం వరకు ఉన్న మహేందర్‌రెడ్డి రూమ్‌కు వెళ్లివస్తానని చెప్పి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వారి రోదనలు మిన్నంటాయి.