హోంగార్డులు సంక్షేమానికి కృషి | Working for the welfare of hongards | Sakshi
Sakshi News home page

హోంగార్డులు సంక్షేమానికి కృషి

Feb 5 2017 12:05 AM | Updated on Sep 2 2018 3:08 PM

: హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. దిన్నెదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డులకు నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి.

- ఎస్పీ ఆకే రవికృష్ణ
- ముగిసిన శిక్షణ తరగతులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ  అన్నారు. దిన్నెదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డులకు నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. అన్ని సబ్‌డివిజన్లకు సంబంధించిన హోంగార్డులకు ఇండోర్, అవుట్‌డోర్‌ తరగతుల్లో శిక్షణ ఇచ్చారు. చివరిరోజు ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం హోంగార్డుల పరేడ్‌ను వీక్షించారు. అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ శివరామ్‌ప్రసాదు, ఓఎస్‌డీ రవిప్రకాష్, హోంగార్డు కమాండెంట్‌ చంద్రమౌళి, డీఎస్పీలు కృష్ణమోహన్, మురళీధర్, ట్రాఫిక్‌ ఆర్‌ఐ ఏడుకొండలు, ఆర్‌ఎస్‌ఐ రంగనాథ్‌బాబు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement