రొయ్యల ఫ్యాక్టరీలో కూలీ మృతి | worker dead in prawn processing unit | Sakshi
Sakshi News home page

రొయ్యల ఫ్యాక్టరీలో కూలీ మృతి

Oct 22 2016 1:40 AM | Updated on Sep 4 2017 5:54 PM

అత్తిలి : తిరుపతిపురంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

అత్తిలి : తిరుపతిపురంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎస్సై వి.ఎస్‌.వీరభద్రరావు కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బైరెత్తి మల్లేష్‌(30) అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేయడానికి వస్తున్నాడు. గురువారం సాయంత్రం మల్లేష్‌ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని తోటి కార్మికులు 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తల్లి సత్యవతి   ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement