దొంగచాటుగా వీడియో తీసి.. | Women Harassment: realter arrested in vijayawada | Sakshi
Sakshi News home page

దొంగచాటుగా వీడియో తీసి..

Mar 30 2016 7:59 PM | Updated on Aug 20 2018 4:27 PM

దొంగచాటుగా వీడియో తీసి.. - Sakshi

దొంగచాటుగా వీడియో తీసి..

ఓ మహిళను దొంగచాటుగా వీడియో తీసి లోబర్చుకోవడమే కాకుండా ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్న రియల్టర్ ఘటన ఇది.

విజయవాడ (మధురానగర్): ఓ మహిళను దొంగచాటుగా వీడియో తీసి లోబర్చుకోవడమే కాకుండా ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్న రియల్టర్ ఘటన ఇది. సింగ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన టీడీపీ సానుభూతిపరుడు. రామలింగేశ్వరపేటకు చెందిన ఓ మహిళ.. భర్తతో మనస్పర్థల కారణంగా తల్లిదండ్రులతో కలసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే మండవ రవికాంత్ కుటుంబసభ్యులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె రవికాంత్‌కు ఆరు లక్షల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చింది.

రవికాంత్ భార్య ఆ మహిళ ఫొటోలు, వీడియోలు తీసి భర్తకు అందజేసేది. ఆ వీడియోలను చూపించి అతను మహిళను లోబరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని వేధింపులు భరించలేక సదరు మహిళ హైదరాబాద్ వెళ్లిపోయింది. అయినా వదలకుండా ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తిరిగి విజయవాడ చేరుకుని సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవికాంత్‌పై 420, 342, 354ఏ, 354సీ, 324, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఏసీపీ సత్యానందం రవికాంత్‌ను అరెస్టు చేశారు. మహిళను లోబరుచుకోవడమే కాకుండా ఆమె ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించని అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రవికాంత్ అధికార పార్టీ కార్యకర్తగా చెలామణి అవుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement