యువతి బలవన్మరణం | woman suicides | Sakshi
Sakshi News home page

యువతి బలవన్మరణం

May 4 2017 11:44 PM | Updated on Nov 6 2018 8:28 PM

కణేకల్లు కొత్తకొట్టాలకు చెందిన హసీన(18) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు కొత్తకొట్టాలకు చెందిన హసీన(18) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గోరంట్ల మండలం శెట్టిపల్లికి చెందిన అబీద కణేకల్లులో ఎంపీఈఓగా పని చేస్తున్నారు. ఆమె భర్త భర్త డేవిడ్‌తో కలసి కొత్తకొట్టాలలో నివాసముంటున్నారు. అక్కకు తోడుగా హసీన ఇక్కడే ఉంటోంది. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు గురువారం మరోసారి నొప్పి ఎక్కువైంది. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కణేకల్లు పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. 

Advertisement
 
Advertisement
Advertisement