రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం | woman diedbody found at railway track | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం

Jan 3 2017 12:13 AM | Updated on Sep 5 2017 12:12 AM

మొలగవళ్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో (సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ఆస్పరి రైల్వేస్టేషన్‌ నుంచి మొలగవళ్లి మీదుగా వెళ్లే మార్గం) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు.

– మృతిపై పలు అనుమానాలు
ఆలూరు రూరల్‌: మొలగవళ్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో (సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ఆస్పరి రైల్వేస్టేషన్‌ నుంచి మొలగవళ్లి మీదుగా వెళ్లే మార్గం) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. స్థానిక రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్టేషన్‌ మాస్టర్, గ్యాంగ్‌మెన్లు అక్కడికి వెళ్లి  రైల్వే ట్రాక్‌  మధ్య  పడి ఉన్న యువతి మృతదేహాన్ని  పరిశీలించారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల్లోపు ముంబాయి నుంచి చెన్నై, ముంబాయి నుంచి కోల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..యువతి పడి ఉన్న మృతదేహం పక్కనున్న ట్రాక్‌పై వెళ్లాయి. ఆ యువతి ప్రమాదవశాత్తు ఆ రైళ్ల నుంచి కిందపడి మృతిచెందిందేమోనని మొలగవళ్లి రైల్వేస్టేషన్‌ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందిచగా..సాయంత్రం 6 గంటలకు కూడా వారు రాలేదు. మృతదేహానికి కొద్ది దూరంలో మందుబాటిళ్లు , వాటర్‌బాటిళ్లు పడి ఉన్నాయి. ఆ యువతిని ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి చంపి పడేశారా, లేక ప్రమాదవశాత్తు  రైలు నుంచి కింద పడి మృతిచెందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే ట్రాక్‌ మధ్యలో ఆమె కుడికాలు తెగి పడి ఉంది. ముఖం కూడా గుర్తుపట్టని విధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement