నక్సలిజంతో అంతర్గత భద్రతకు ముప్పు | Sakshi
Sakshi News home page

నక్సలిజంతో అంతర్గత భద్రతకు ముప్పు

Published Tue, Dec 8 2015 1:19 AM

నక్సలిజంతో అంతర్గత భద్రతకు ముప్పు - Sakshi

డీజీపీ అనురాగ్‌శర్మ
 సాక్షి, హైదరాబాద్: దేశంలో వామపక్ష తీవ్రవాదం కారణంగా అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతోందని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి స్థానిక పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలు కూడా నిత్యం సంఘర్షణ చేస్తున్నాయన్నారు. దేశంలో నక్సలైట్ల తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం కోసం సోమవారం పోలీస్ అకాడమీలో నక్సల్, తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల పోలీసులకు ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను అనురాగ్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్, పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్ల నక్సల్స్‌ను ఎదుర్కోగలిగామన్నారు.

శిక్షణ తరగతుల్లో కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడులకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement