తల్లీకూతురుపై తండ్రి దాడి: కుమార్తె మృతి | Wife and daughter attacked by husband in medak district | Sakshi
Sakshi News home page

తల్లీకూతురుపై తండ్రి దాడి: కుమార్తె మృతి

Oct 3 2015 1:20 PM | Updated on Jul 27 2018 2:21 PM

మగ పిల్లవాడు పుట్టడం లేదని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు రెండేళ్ల కుమార్తెని భర్త ధన్రాజ్ తీవ్రంగా కొట్టాడు.

మెదక్ : మగ పిల్లవాడు పుట్టడం లేదని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు రెండేళ్ల కుమార్తెని భర్త ధన్రాజ్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి పింకి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ జిల్లా పటాన్చెరు గౌతమ్నగర్లో నివసిస్తున్న ధన్రాజ్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం పాప పింకి జన్మించింది. అయితే మగపిల్లవాడు జన్మించడం లేదని ధన్రాజ్ తరచు భార్యను వేధించేవాడు.

ఆ క్రమంలో సెప్టెంబర్ 29వ తేదీన భార్యతోపాటు పింకిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు పింకి మరణించింది. ఈ విషయం బయటకు వెల్లడిస్తే...చంపేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో ఆమె మిన్నకుండి పోయింది. అయితే ఏం జరిగిందని పింకి తల్లిని ఆమె బంధువులు నిలదీయడంతో జరిగిన విషయాన్ని వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ధన్రాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement